Jump to content

హైదరాబాద్ సివిల్ సర్వీస్

వికీపీడియా నుండి

హైదరాబాద్ సివిల్ సర్వీస్ (హెచ్.సి.ఎస్) అనేది హైదరాబాద్ రాజ్యంలో ఒక ఆధునిక పౌరసేవా వ్యవస్థ. 1882లో సర్ సాలార్ జంగ్ I పాత మొఘల్ పరిపాలన పద్ధతులు, సంప్రదాయాలను తొలగించి హైదరాబాద్ సివిల్ సర్వీస్‌ను ప్రారంభించాడు.

జిలాబందీ వ్యవస్థ ఏర్పాటు, సుబేదారీ, తాలూకాదారీ వ్యవస్థ ఏర్పాటు, సాలార్ జంగ్ ద్వారా రెవెన్యూ, పోలీసు, న్యాయపరమైన సంస్కరణలు హైదరాబాద్ సివిల్ సర్వీస్ ఏర్పాటును సులభతరం చేశాయి.

కొత్త వ్యవస్థ బ్రిటిష్ పరిపాలనా పద్ధతులపై ఆధారపడడంతోపాటు హైదరాబాద్ రాష్ట్ర సర్వీస్ చట్టపరమైన ప్రణాళిక 1919లో క్రోడీకరించబడిన నియమాలు, నిబంధనల ద్వారా రూపొందించబడింది. హైదరాబాద్ సివిల్ సర్వీస్ అనేది హైదరాబాదు రాజ్యంలో ఒక గౌరవనీయమైన, ఒక ఉన్నతమైన హోదాగా పరిగణించబడింది. పోటీ పరీక్ష ద్వారా ప్రభుత్వ అధికారుల ఎంపిక జరిగింది.

1948లో పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సివిల్ సర్వీస్ రద్దు చేయబడి, అందులోని అధికారులు భారత ప్రభుత్వ పౌర సేవల్లోకి చేర్చబడ్డారు.[1] ఖైరతాబాద్ సమీపంలో ఉన్న హైదరాబాద్ సివిల్ సర్వీస్ హౌస్‌లో హైదరాబాద్ సివిల్ సర్వీస్ ఉన్నత అధికారులు వసతి పొందారు. 1950లో విలీనం తర్వాత ఈ భవనం కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌గా మార్చబడింది.[2]

నేపథ్యం

[మార్చు]

పర్షియా దేశం నుంచి వచ్చిన వారు బహమనీ రాజ్యంలో అఫాఖీలు పేరుతో అనేక పదవులు పొందారు. దక్కనీయులను ముల్కీలు అనేవారు. ఉన్నత స్థానంలో ఉన్న అఫాఖీలకు, ముల్కీలకు మధ్య ఘర్షణలు జరిగడంతోపాలు విద్య, ఉద్యోగ రంగాల్లో పర్షియన్స్​‍ ప్రమేయాన్ని స్థానిక దక్కనీయులు వ్యతిరేకించారు.

బహమనీ సుల్తాన్‌లు పర్షియా దేశానికి చెందినవారు కావడంతో అఫాఖీలకు ప్రాముఖ్యం ఇచ్చి, స్థానిక దక్కనీయులపై పక్షపాతం చూపించడం ప్రారంభించారు. బహమనీ సుల్తాన్‌ల పాలనలో అఫాఖీలకు, దక్కనీయులకు మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత దక్కన్‌/హైదరాబాద్‌ రాజ్యాన్ని పాలించిన కుతుబ్‌షాహీల కాలంలో కూడా ముల్కీ, నాన్‌ ముల్కీ సమస్య కొనసాగింది. అక్కన్న, మాదన్న పరిపాలనా కాలంలో ముల్కీలకు ప్రాధాన్యం పెరిగడంతో అఫాఖీలు నిరాదరణకు గురయ్యారు. దాంతో వారు కుతుబ్‌షాహీ పాలనను అంతమొందించడానికి మొఘల్‌ చక్రవర్తులకు సాయపడ్డారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Telangana State Public Service Commission". Telangana State Public Service Commission. Archived from the original on 1 నవంబరు 2018. Retrieved 1 November 2018.
  2. Khalidi, Omar (2009). A GUIDE TO ARCHITECTURE in HYDERABAD, DECCAN, INDIA (PDF). Cambridge, Massachusetts: MIT LIBRARIES.
  3. Nipuna. "హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్ ఎప్పుడు ఏర్పడింది?". www.nipuna.ntnews.com. Archived from the original on 2023-05-02. Retrieved 2023-05-02.