మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sir Salar Jung GCSI
మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I
The Nizam's indispensable Prime Minister, Sir Salar Jung

పదవీ కాలము
1853 – 1883
చక్రవర్తి Asaf Jah IV
Asaf Jah V
Asaf Jah VI
ముందు Siraj ul-Mulk
తరువాత Mir Laiq Ali Khan, Salar Jung II

వ్యక్తిగత వివరాలు

జననం 1829 may 31
Bijapur, Satara
మరణం 1883
Hyderabad, Hyderabad State
మతం Islam

మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I (1829–1883) హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన రాజకీయవేత్త, హైదరాబాద్ రాజ్య దివాన్. హైదరాబాద్ రాజ్యానికి దివాన్లుగా పనిచేసిన వారందరిలోకీ గొప్పవానిగా సుప్రసిద్ధుడు. నిజాం పాలకులు ఆయనకు సాలార్ జంగ్ అన్న బిరుదు ఇవ్వగా, బ్రిటీష్ వారు సర్ బిరుదాన్ని ఇచ్చారు. వెరసి సర్ సాలార్ జంగ్ గా ఆయన సుప్రసిద్ధి పొందారు. ఆయన వంశానికే చెందిన, హైదరాబాద్ రాజ్య దివానులైన ముగ్గురు సాలార్ జంగ్ లలో ఈయన మొదటివారు. సాధారణ ప్రజానీకం ఆయనను నవాబ్ సాహెబ్ గా పిలిచేవారు.
ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి సాలార్ జంగ్, ఆయన మరణానంతరం పసిపిల్లవాడైన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ కు పద్నాలుగేళ్ళ పాటు మంత్రిత్వం నెరపారు. తరాలుగా రాజ్యంలో బ్రిటీష్ ప్రతినిధి అయిన రెసిడెంట్, భారతదేశంలో బ్రిటీష్ పరిపాలన నెరపే వైశ్రాయ్/గవర్నర్ జనరల్ ల మాటకు ఎదురు లేని హైదరాబాద్ రాజ్యంలో మొదటి సాలార్ జంగ్ మాత్రం దృఢమైన వ్యక్తిత్వంతో తనకు ఇష్టంవచ్చిన సంస్కరణలు అమలుచేశారు. ప్రభుత్వంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు, అలసత్వం చక్కదిద్దుతూ పాలనాపరమైన సంస్కరణలకు నాంది పలికారు. మొత్తం ప్రభుత్వాన్ని తన పట్టులో నిలుపుకుని ప్రభావశీలమైన కృషిచేశారు.

కుటుంబం[మార్చు]

మీర్ తురాబ్ అలీ ఖాన్ బీజాపూర్ లో 1829 సంవత్సరంలో ఉన్నత ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన వంశం తొలినాళ్ళ నుంచి భారతీయ రాజకీయాల్లో ప్రముఖమైనది. బీజాపూర్ సుల్తానులైన ఆదిల్‌షాహీల వద్ద, ఆపైన ఢిల్లీ చక్రవర్తుల వద్ద, చివరకు హైదరాబాద్ నిజాంల వద్ద పనిచేశారు. ఆయనకన్నా ముందుగానే ఆయన వంశస్థులు, బంధువులైన మరో ఇద్దరు నిజాంకు దివాన్లుగా పనిచేశారు. ఆయన మావయ్య సిరాజ్-ఇ-ముల్క్ ఆయనకు ముందు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. ఆయన మరణంతోనే మీర్ తురాబ్ అలీ ఖాన్ ప్రధాని అయ్యారు. మీర్ తురాబ్ అలీ కుమారుడు మీర్ లాయక్ అలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ గానూ, మనవడు మీర్ యూసఫ్ అలీ ఖాన్ మూడవ సాలార్ జంగ్ గానూ ప్రసిద్ధి పొంది, హైదరాబాద్ రాజ్య దివాన్ పదవి చేపట్టారు.

విద్యాభ్యాసం[మార్చు]

మీర్ తురాబ్ అలీ ఖాన్ తర్వాతికాలంలో తనకు రాజకీయ సలహాదారుగా పనిచేసిన నవాబ్ సర్వార్ ఉల్ ముల్క్ వద్ద చదువుకున్నారు.

ఉద్యోగ జీవితం[మార్చు]

1853లో అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాని సిరాజుల్-ముల్క్ మరణించడంతో ఆయనకు వారసునిగా అల్లుడైన మీర్ తురాబ్ అలీ ఖాన్ దివాన్ పదవి చేపట్టారు. 1853 నాటికి నాలుగవ నిజాం నసీరుద్దౌలా రాజ్యపాలకునిగా ఉన్నారు.

1857 తిరుగుబాటు[మార్చు]

ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన 4 సంవత్సరాలకే 1857లో పరీక్షా సమయం ఎదురైంది. భారత దేశాన్ని చుట్టుముట్టిన సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ఆ సంవత్సరం ప్రారంభమైంది. హైదరాబాద్ రాజ్యంలో కూడా దాని ప్రభావం కనిపించింది. బెంగాల్, మీరట్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సిపాయిలు, కొందరు స్థానిక నాయకులు, సంస్థానాధీశులు తిరుగుబాటు చేశారు. సరిగా అదే సమయంలో నాలుగో నిజాం మరణించారు.

మూలాలు[మార్చు]