హై సిటడల్
దస్త్రం:Desmond Bagley-High Citadel.jpg | |
రచయిత(లు) | డెస్మన్డ్ బాగ్లీ |
---|---|
దేశం | యునైటెడ్ కింగ్డమ్ |
భాష | ఆంగ్లము |
శైలి | థ్రిల్లర్ నవల |
ప్రచురణ కర్త | హౌస్ ఆఫ్ స్ట్రాటస్ |
ప్రచురించిన తేది | 1965 |
మీడియా రకం | ముద్రణ (Hardcover & Paperback) |
పుటలు | 296 పేజీలు |
ISBN | 1-84232-012-2 |
OCLC | 44013818 |
Preceded by | ద గోల్డెన్ కీల్ |
Followed by | వ్యాట్స్ హరికేన్ |
హై సిటడెల్ (High Citadel- తెలుగు అర్థము: కొండ మీదున్న కోట, దుర్గము) అనేది ఆంగ్ల రచయిత డెస్మన్డ్ బాగ్లీ వ్రాసిన నవల. దీని మొదటి ముద్రణ 1965 లో జరిగింది.
కథ
[మార్చు]దక్షిణ అమెరికా లోని ఒక కాల్పనిక దేశంలో, ఒక చిన్న పౌర విమానం, కమ్యూనిస్టు ఐన దాని సహాయక చోదకునిచే, హైజాక్ చేయబడుతుంది. అతడు దాన్ని ఎండీస్ పర్వతశ్రేణుల్లో ఎత్తున ఉన్న ఒక వైమానికతలముపై క్రాష్ ల్యాండ్ చేస్తాడు. ప్రయాణీకులలో ఒకరు ఉదారవాదీ, మాజీ అధ్యక్షుడూ ఐన అగ్యిల్లర్. మునుపటి తిరుగుబాటులో పదవీచ్యుతుడై అతను ఇప్పుడు తిరిగి వస్తున్నాడు. కమ్యూనిస్టులు తాము అధికారము చేజిక్కించుకునేందుకు అతన్ని చంపాలని కుట్ర పన్నుతారు. కానీ కొండ పైకి వెళ్ళేందుకు దాటాల్సిన వంతెన కూలిపోవడముతో విమానము దిగే సమయానికి వారు అక్కడికి చేరుకోలేకపోతారు. విమానాన్ని హైజాక్ చేసిన సహాయ చోదకుడు, దాన్ని క్రాష్ ల్యాండ్ చేసేటప్పుడు మరణిస్తాడు.
ప్రాణాలతో బయటపడిన ప్రయాణీకుల్లో ఆంగ్లేయ విమానచోదకుడు ఓ'హారా, అగ్యిల్లర్, అగ్యిల్లర్ యొక్క అంగరక్షకుడు ఇంకా అతని అందమైన మేనకోడలు, ఒక వృద్ధ అమెరికా బడిపంతులూ, ఇద్దరు అమెరికా వ్యాపారవేత్తలు, ఒక శాస్త్రవేత్తా, ఒక చరిత్రకారుడూ ఉన్నారు. తీవ్రమైన చలీ అలాగే కొండలపైన గాలిలో ప్రాణవాయువు శాతము తగ్గినందున కలిగే అస్వస్థతల నుండి తప్పించుకోవడానికి ఓ'హారా నేతృత్వములో వారందరూ కొండ కిందకు వస్తారు. అక్కడ వంతెన వద్ద వారు దానికి మరమ్మత్తులు చేస్తున్న కమ్యూనిస్టులకు ఎదురు పడతారు.
ఓ'హారా ఇంకా ఇతర ప్రయాణీకులు చరిత్రాకారుని సూచనలతో, శాస్త్రవేత్త సహాయముతో పక్కన పాడుబడ్డ ఒక గనిలో దొరికిన కొన్ని వస్తువులతో ఆపద్ధర్మ ఆయుధాలను తయారు చేసి కమ్యూనిస్టులతో పోరాడతారు. అగ్విల్లర్ స్నేహితులను సహాయంగా తెచ్చేందుకు ఒక ముగ్గురు వ్యక్తులు పర్వత శిఖరాలపై నుండి ఒక ప్రమాదకరమైన దారిలో బయలుదేరతారు.
మరింత మంది కమ్యూనిస్టు బలగాలు రావడముతో ఈ 'దుర్గము' యొక్క ముట్టడి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. అటు పక్క సహాయము తెచ్చేందుకు పయనమైన వారు తీవ్ర ప్రమాదాలనూ, రాజకీయ కుతంత్రాలనూ ఎదుర్కొంటారు.