123 ఫ్రం అమలాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
123 ఫ్రం అమలాపురం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం వర్మ
తారాగణం రవి ప్రకాష్, రాజా శ్రీధర్, అనిల్, నిత్యామీనన్ దాస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
విడుదల తేదీ ఆగష్టు 25, 2005
భాష తెలుగు

123 ఫ్రం అమలాపురం 2005 ఆగస్టు 25న విడుదలైన తెలుగు సినిమా. 9 మూవీస్ మేకర్స్ బ్యానర్ పై కె.సీతా అలివేలు నిర్మించిన ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించాడు. రవి ప్రకాష్, రాజా శీధర్, అనిల్, నిత్యామీనన్ ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు వెంకటేశర సంగీతాన్నందించాడు. ఈ సినిమాను కె.వి.వి.సూర్యనారాయణ రెడ్డి సమర్పించాడు.[1]

కథ[మార్చు]

అమలాపురంలో పరంధామ్ (రవి ప్రకాష్), పెద్దా (రాజా శ్రీధర్) & చిన్నా (అనిల్) అనే ముగ్గురు చెడిపోయిన యువకులు ఉంటారు. అమలాపురాన్ని సందర్శన కోసం వైజాగ్ నుండి వచ్చిన ఒక అమ్మాయి (నిత్య దాస్)తో వారు మోహానికి లోనవుతారు. వారికి ఆమెతో బలమైన అనుబంధం పెరుగుతున్న తరుణంలో అందులో ఒకడు ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తాడు. అమలాపురంలో తమకు లభించిన చెడ్డపేరుతో కలత చెందిన ఈ యువకులు తమ స్థావరాన్ని వైజాగ్‌కు మార్చుతారు. గ్రామంలో వారు కలుసుకున్న అమ్మాయి తన కోచ్ లైంగిక వేధింపుల వల్ల, ఆమె బావ చేసిన మానసిక వేధింపుల కారణంగా తీవ్ర నిరాశలో ఉందని వారు అక్కడ గ్రహించారు. ఆమె టెన్నిస్ ఛాంపియన్ కావాలని కోరుకుంటుంది. ఆమె కలని సాధించడానికి ఈ కుర్రాళ్ళు ఆమెకు ఎలా సహాయం చేస్తారనే దాని గురించి మిగిలిన చిత్రం.

తారాగణం[2][మార్చు]

  • రవిప్రకాష్
  • రాజా శ్రీధర్
  • అనిల్
  • నిత్యా దాస్
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • కృష్ణ భగవాన్
  • కొండవలస లక్ష్మణరావు
  • మల్లాది రాఘవ
  • ఎం.వి.ఎస్.హరనాథరావు
  • నరసింహరాజు
  • జోగి నాయుడు
  • రాజబాబు
  • అన్నపూర్ణ
  • హేమ
  • సాగర్ సందీప్

మూలాలు[మార్చు]

  1. "123 from Amalapuram (2005)". Indiancine.ma. Retrieved 2021-05-10.
  2. "123 from Amalapuram - Telugu cinema Review - Ravi Prakash, Anil, Raja Sridhar, Nitya Das". www.idlebrain.com. Retrieved 2021-05-10.

బాహ్య లంకెలు[మార్చు]