1857 పూర్వరంగములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1857 పూర్వరంగములు గ్రంథం భారత తొలి స్వాతంత్ర్య సమరంగా పేరొందిన 1857 తిరుగుబాటు వెనుకనున్న కారణాల గురించి వివరించే చరిత్ర గ్రంథం. ఈ గ్రంథాన్ని ప్రముఖ చారిత్రికులు దిగవల్లి వేంకటశివరావు రచించారు. సిపాయిల పితూరిగా పాశ్చాత్య చరిత్రకారులు తక్కువచేసి చూపిన ఈ యుద్ధం భారత స్వాతంత్ర్య చరిత్రలో కీలకమైనదని వివరిస్తూ ఆయన ఈ గ్రంథరచన చేశారు.

రచన నేపథ్యం

[మార్చు]

1857 పూర్వరంగములు గ్రంథాన్ని శివరావు 1957లో రచించి ప్రచురించారు. బ్రిటీష్ చరిత్రకారులు, వారి అనుయాయులు భారతదేశాన్ని వలసపాలన నుంచి విముక్తి చేసే మహాప్రయత్నమైన 1857 యుద్ధాన్ని జాతీయ స్వాతంత్ర్య పోరాటమనేందుకు వీలులేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారనీ, దాన్ని తొలగించి చారిత్రిక సత్యాలు పునస్థాపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రచయిత ముందుమాటలో పేర్కొన్నారు.

వివరాలు

[మార్చు]

1857–58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని మొదటి భారత స్వాతంత్ర్య్య యుద్ధం అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకీ బ్రిటీష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీసాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్లగల నిర్లక్ష్య వైఖరి మరియూ ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. 1857 సిపాయిల తిరుగుబాటు/ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం వెనుక గల చారిత్రిక శక్తులు, ఆ యుద్ధం పరిణమించేందుకు కారణమైన పరిస్థితుల గురించి వ్రాసిన చరిత్ర గ్రంథం. ప్రముఖ చారిత్రికులు దిగవల్లి వేంకట శివరావు పలు ప్రామాణిక ఆధారాల నుంచి ఈ గ్రంథాన్ని రచించారు.

బయటి లింకులు

[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో గ్రంథ ప్రతి