1946 భారతదేశానికి క్యాబినెట్ మిషన్
1946లో యునైటెడ్ కింగ్ డం క్యాబినెట్ మిషన్ భారతదేశానికి రాక భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేందుకు బ్రిటీష్ ప్రభుత్వానికి భారతదేశ నాయకత్వానికి మధ్య అధికార బదిలీ గురించి చర్చించేందుకు ఉద్దేశించింది. యునైటెడ్ కింగ్ డం ప్రధాని క్లెమెంట్ అట్లీ చొరవతో ఏర్పాటైంది. దీనిలో భారతదేశ రాజ్య వ్యవహరాల కార్యదర్శి లార్డ్ పెథిక్ లారెన్స్, బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అధ్యక్షుడు సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అడ్మిరాలీటి మొదటి లార్డ్ ఎ.వి.అలెగ్జాండర్ ఉన్నారు. మిషన్ ప్రతీ కార్యకలాపంలోనూ పాల్గోకున్నా భారతదేశ వైశ్రాయ్ లార్డ్ వెవెల్ అనియమిత సభ్యుడు అనదగ్గ విధంగా పాల్గొన్నారు.[1]
ఉద్దేశాలూ, ప్రతిపాదనలు
[మార్చు]బ్రిటీష్ ఇండియాకు, భారతీయ ప్రావిన్సులకు చెందిన ఎన్నికైన ప్రతినిధులతో రాజ్యాంగాన్ని ఏర్పరిచే పద్ధతి గురించి, రాజ్యాంగ సభ ఏర్పాటును, ప్రధాన భారతీయ పార్టీల మద్దతుతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు గురించి సన్నాహక చర్చలు చేయడం క్యాబినెట్ మిషన్ ఉద్దేశం.
భారత రాజ్యాంగ సభకు ఎన్నికైన రెండు అతిపెద్ద రాజకీయ పక్షాలైన భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ లతో చర్చలు చేసింది. రెండు రాజకీయ పక్షాలకు అంగీకారయోగ్యమైన అధికార బదిలీ గురించి, బ్రిటీష్ సమైక్యంగా ఉండడమా, విభజించడమా అన్న ప్రశ్నపైనా మిషన్ తో చర్చించాయి. గాంధీ, నెహ్రూ, పటేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాల కన్నా ఎక్కువగా కేంద్రంలో అధికారాలు నెలకొనివుండడాన్ని ఆశించింది.[2] జిన్నా నాయకత్వంలోని ఆలిండియా ముస్లిం లీగ్ భారతదేశాన్ని సమైక్యంగా ఉండనిచ్చి, ముస్లిములకు ప్రజాప్రాతినిధ్యం, శాసన వ్యవస్థల్లో అవకాశాల కల్పన వంటి రాజకీయ రాయితీలు కల్పించాలని కోరింది, అప్పటికే ఆ పార్టీ ప్రచారంతో ముస్లిముల్లో బ్రిటీష్ వారు అధికార బదిలీ చేయగానే బ్రిటీష్ రాజ్ నేరుగా హిందూ రాజ్ గా పరిణమిస్తుందన్న భావన ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తాను హిందూ పక్షానికి ప్రతినిధినన్న నిర్వచనానికి అంగీకరించలేదు, జాతీయవాద పార్టీనైన తనలోని జాతీయవాద ముస్లిములను కూడా ముస్లిం ప్రతినిధులుగా భావించాలని ఆశించింది. కానీ ప్రభుత్వం ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా ముస్లింలీగ్ ను భావిస్తూ వచ్చారు. ప్రాథమికమైన చర్చలు అంతటితో ముగియగా, మిషన్ కొత్త ప్రభుత్వ కూర్పు గురించి తన ప్రణాళికను 1946 మే 16న ప్రతిపాదించింది.
కేబినెట్ మిషన్ 1946 మార్చి 23న భారతదేశానికి, 1946 ఏప్రిల్ 2న ఢిల్లీకి వచ్చింది. మే మొదట వారంలో సిమ్లా కాన్ఫరెన్స్ తర్వాత 1946 మే 16లో ప్రణాళికలో మొదటి ప్రణాళిక, ప్రణాళికలోని వేర్వేరు అంశాలు కాంగ్రెస్, లీగ్ లకు ఆమోదం లేకపోవడంతో 1946 జూన్ 16న రెండవ ప్రణాళిక ప్రకటించారు.
మే 16 ప్రణాళిక
[మార్చు]16 మే 1946న సమైక్యమైన భారత డొమినియన్ ను వదులైన ప్రావిన్సుల సమాఖ్య గురించిన ప్రతిపాదన ప్రముఖంగా దాన్ని ప్రకటించిన తేదీ పేరుతో ప్రాచుర్యం పొందింది:
- సమైక్యమైన భారత డొమినియన్ కు స్వాతంత్ర్యం ఇవ్వవచ్చు.
- ముస్లిం సంఖ్యాధిక్య ప్రావిన్సులైన సింధ్, పంజాబ్ (అప్పటి సంయుక్త పంజాబ్), బెలూచిస్తాన్, వాయవ్య సరిహద్దు ప్రావిన్సులు ఒక గ్రూపు, సంయుక్త బెంగాల్, సంయుక్త అస్సాం కలిసి మరొక గ్రూపు ఏర్పరుస్తారు.
- మధ్య, దక్షిణ భారతదేశంలోని హిందూ సంఖ్యాధిక్య ప్రావిన్సులు కలిపి మరొక గ్రూపు ఏర్పడుతుంది.
- కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది, ఇది రక్షణ, కరెన్సీ, దౌత్యం వంటి జాతీయ స్థాయి వ్యవహారాలు చూసుకుంటూంటుంది. మిగతా అధికారాలు, బాధ్యతలు ప్రావిన్సుల వద్దే ఉంటాయి, రెంటినీ గ్రూపులు సమన్వయం చేస్తూంటాయి.
జూన్ 16 ప్రణాళిక
[మార్చు]1946 మే 16 నాటి ప్రణాళికలో దేశంలోని వివిధ పార్టీల ఆకాంక్షల మేరకు సమైక్య భారతదేశం ఉంది, కానీ కేంద్ర లెజిస్లేచర్ స్థాయిలో హిందువుల సంఖ్యాధిక్యత తీసివేసేలా, ప్రావిన్సులను అసమంగా గ్రూప్ చేశారంటూ, గ్రూపుల్లో ముస్లిం లీగ్కు ఆధిక్యత వస్తోందంటూ కాంగ్రెస్ వ్యతిరేకించింది. పైగా ప్రావిన్సులు కావాలంటే గ్రూపును విడిచివెళ్ళే అవకాశాన్ని నిర్వచించడంలో అస్సాం గ్రూపును వదలనివ్వకుండా బెంగాల్ ఓటువేస్తుందన్నది చాలా అసమంజసంగా వారికి కనిపించింది. ఈ ప్రణాళికలోని కొన్ని అంశాలకు కాంగ్రెస్ వేరే నిర్వచనాలు చెప్పడంతో, ఆయా నిర్వచనాలు ముస్లిం లీగ్ అంగీకరించలేదు. ఈ ప్రణాళికలో ముస్లిం లీగ్ ఏ విధమైన మార్పు చేయడానికీ అంగీకరించలేదు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో సమానాధిక్యాన్ని వ్యతిరేకిస్తూండడం, గ్రూపుల నుంచి విడిపోయే అవకాశాన్ని ప్రావిన్సులకు కల్పించేందుకు ముస్లిం లీగ్ ఒప్పుదల లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రతిష్టంభన ఏర్పడడంతో బ్రిటీష్ వారు భారతదేశాన్ని హిందూ సంఖ్యాధిక్య భారతదేశం, తర్వాత్తర్వాత పాకిస్థాన్ గా పేరొందిన ముస్లిం సంఖ్యాధిక్య భారతదేశంగా విభజించే మరొక ప్రణాళికను 1946 జూన్ 16లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలోనే భారతీయ సంస్థానాలు రెండు డొమినియన్లలో ఏదో ఒకదానిలో చేరేందుకు లేదంటే స్వతంత్రంగా ఉండిపోయేందుకు హక్కు ఉందన్న అంశమూ ఉంది.
ప్రతిస్పందనలు, అంగీకారం
[మార్చు]కొత్త ప్రభుత్వ కూర్పును ప్రణాళికల ఆమోదం నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధికారికంగా రెంటిలో ఏ ప్రణాళికనూ అంగీకరించలేదు. 1946 మే 24 నాటి కమిటీ తీర్మానంలో కౌన్సిల్ ఏర్పాటు,
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ గాంధీ, రాజ్ మోహన్. వల్లభ్ భాయ్ పటేల్ జీవిత కథ (in తెలుగు (అనువాదం)) (1 ed.). విజయవాడ: ఎమెస్కో బుక్స్.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Seervai, H. M.: Partition of India: Legend and Reality, 2005. Intro: xxvi. ISBN 0-19-597719-X