Jump to content

2007 ఉత్తర ఇరాక్ ఆక్రమణ

వికీపీడియా నుండి

2014 జూన్‌లో, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐ.ఎస్.ఐ.ఎస్.) లేదా ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్(ఐ.ఎస్.ఐ.ఎల్) అనే సంస్థ మరికొన్ని బలగాలతో కలిసి ఇరాకీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర ఇరాక్ ప్రాంతంలో పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాటానికి నేపథ్యంగా డిసెంబర్ 2013లో ఇరాక్ దేశంలో జరిగిన కల్లోలాలు, వివాదాలు ఉన్నాయి. సమర్రా ప్రాంతంలో జూన్ 5న జరిగిన దాడితో ప్రారంభించి, జూన్ 9న మోసుల్ దిగ్బంధం, జూన్ 11న తిక్రిత్ దిగ్బంధంతో కొనసాగిస్తూ ఐ.ఎస్.ఐ.ఎస్., అనుబంధ బలగాలు కలిసి పలు నగరాలను ఇతర ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నాయి. ఇరాకీ ప్రభుత్వ సైన్యాలు జూన్ 13న దక్షిణ దిశగా కదలడంతో కుర్దిష్ బలగాలు వివాదాస్పదమైన ఉత్తర ఇరాక్ ప్రాంతంలోని కిర్కుక్‌లోని చమురు క్షేత్రాలపై ఆధిక్యత సంపాదించాయి. జూన్ నెలాఖరుకు ఇరాక్ ప్రభుత్వం జోర్డాన్, సిరియాలతో పాటుగా పశ్చిమ సరిహద్దుపై తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది.
మోసుల్ దాడి, ఆపైన రాత్రికి రాత్రి దిగ్బంధం వంటి పరిణామాలతో జూన్ 10న ఇరాక్ ప్రధాని నౌరి అల్-మలికి ఆ దేశంలో జాతీయ అత్యయిక స్థితికి పిలుపునిచ్చారు. ఐతే రక్షణ స్థితిగతులను పక్కనపెట్టి ఇరాక్ పార్లమెంట్ మలికిని అత్యయిక స్థితి అమలుచేసేందుకు అంగీకరించలేదు. పలువురు సున్ని, కుర్దిష్ తెగలకు చెందిన చట్టసభ్యులు ప్రధాని అత్యయిక స్థితి ద్వారా తన అధికార పరిధిని విస్తరించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సెషన్లను బహిష్కరించారు.

నేపథ్యం

[మార్చు]
2007లో బాగ్దాద్ బాంబుదాడి
2007లో బాగ్దాద్ లో జరిగిన బాంబు దాడి

పశ్చిమ ఇరాక్‌లో 2013 డిసెంబరు నుంచి సాయుధులైన తెగలు, ఇరాకీ భద్రతా దళాలు, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవెంట్ సంస్థ(ఐఎస్‌ఐఎస్)ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2014 జనవరి తొలినాళ్ళలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఫల్లుజా, రమదీలను విజయవంతంగా నియంత్రణలోకి తీసుకోగలిగింది. అప్పటికే తన నియంత్రణలో ఉన్న అన్బర్ ప్రావిన్స్‌లో మరింతగా బలపడింది. అనంతరకాలంలో ఇరాకీ సైన్యం ఐఎస్‌ఐఎస్ నియంత్రణలోని అన్బర్ ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు ఎదురుదాడి ప్రారంభించింది. ఈ ఎదురుదాడికి ముందు ఇరాక్ ప్రధాని నౌరి అల్-మలికి ఈ యుద్ధాన్ని ప్రాచీన కాలంలో హుస్సేన్ అనుచరులకు, యాజిద్ అనుయాయులకు మధ్య జరిగిన యుద్ధానికి కొనసాగింపుగా అభివర్ణించడం వివాదాస్పదమైంది. ఆ వ్యాఖ్యల మూలాలు 7వ శతాబ్దినాటిదిగా చెప్పబడే షియైట్ యుద్ధం వరకూ వెళ్తున్నాయి. ఈ వ్యాఖ్యల్లో సున్నీ వర్గీయులను ఇరాకీ ప్రభుత్వాన్ని విడదీసినట్టు అయింది.

ఇదే తరహా ఆక్రమణలు సరిహద్దు దేశమైన సిరియాలో కూడా కొనసాగాయి. ఐఎస్‌ఐఎస్‌కు సిరియాలో ఆయుధాలు లభించడంతో మరింత బలపడింది. జూన్ ప్రారంభంలో ఇరాక్ మధ్య, ఉత్తర ప్రాంతాలకు ఆక్రమణదారులు చొచ్చుకుపోవడం ప్రారంభించారు. అదే సమయంలో ఉగ్రవాదులు ఇంకా ఫల్లుజా, జర్మాలతో పాటుగా హదితా, జుర్ఫ్ అల్ శకర్, అనాహ్, అబు ఘరిబ్ వంటి ఇతర చిన్నచిన్న ప్రాంతాలపై పట్టు సాధించారు.

ఆక్రమణ

[మార్చు]

సమర్రాపై దాడి

[మార్చు]

మోసుల్ ఆక్రమణ, కిర్‌కుక్‌పై దాడి

[మార్చు]

దియాలా మీదుగా బాగ్దాద్ ముట్టడి

[మార్చు]

ప్రభుత్వం ఎదురుదాడి

[మార్చు]

తిరుగుబాటుదారుల మలిదాడులు

[మార్చు]

కారణాలు

[మార్చు]

ప్రతిస్పందనలు

[మార్చు]

అంతర్గతంగా

[మార్చు]

షియాలు

[మార్చు]

సున్నీలు

[మార్చు]

కుర్దిష్‌లు

[మార్చు]

ఇతర దేశాల ప్రతిస్పందనలు

[మార్చు]

ఇతరులు

[మార్చు]