Coordinates: 41°43′32″N 49°56′49″W / 41.72556°N 49.94694°W / 41.72556; -49.94694

2023 టైటన్ నిప్పుకోడి పడవ ప్రమాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2023 టైటన్ నిప్పుకోడి పడవ అంతఃస్ఫోటనం
తేదీ18 జూన్ 2023
ప్రదేశంఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటనిక్ శిథిలాల దగ్గర
భౌగోళికాంశాలు41°43′32″N 49°56′49″W / 41.72556°N 49.94694°W / 41.72556; -49.94694
కారణంప్రెజర్ హల్ పట్టు వదిలెయ్యడం
పాలుపంచుకున్నవారుఓషన్‌గెయ్ట్ సంస్థ సిబ్బందీ, ప్రయాణికులూ.
ఫలితంనిప్పుకోడి పడవ అంతస్స్ఫోటనంలో నాశనమైపోయింది.
మరణాలు5 (see fatalities)

2023 జూన్ 18న, ఓషన్‌గెయ్ట్ అనే అమెరికా పర్యాటక సంస్థ నడుపుతున్న టైటన్ అనే నిప్పుకోడి పడవ/నిమజ్జక నౌక అంతస్స్ఫోటనానికి గురైంది. ఈ సంఘటన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో న్యూఫౌన్డ్‌లెన్డ్ తీరం నుండి 320 నోటికల్ మైళ్ళ (590 కిమీ) దూరంలో జరిగింది. ఈ పడవలో టైటనిక్ శిథిలాలను చూసేందుకు ఐదుగురు ప్రయాణిస్తున్నారు. పడవ మునిగిన గంటా నలభై ఐదు నిమిషాలకు దీనితో సమాచార సంబంధాలు తెగిపోయాయి. నిర్ణీత సమయానికి మళ్ళీ పడవ తేలకపోవడంతో అధికారులు అప్రమత్తం చేయబడ్డారు.

80 గంటల వెదుకులాట తర్వాత, టైటానిక్ అనీంకు 500 మీటర్ల (1600 అడుగులు) దూరంలో, రిమోట్లీ ఒపరెయ్టెడ్ అన్డర్‌వోటర్ వీయ్కిల్ (Remotely operated underwater vehicle-ROV, అర్థం: పరోక్ష నిర్వహిత జలాంతర్గత వాహనం) టైటాన్ శకలాలను కనుగొంది. పడవతో సంబంధాలు తెగిపోయిన సమయంలోనే అమెరికా నావికాదళ రహస్య శబ్ద పర్యవేక్షణ వ్యవస్థ ఒక శబ్దాన్ని పసిగట్టింది. ఈ శబ్దపు తీరుతెన్నులు అంతఃస్ఫోటనంతో సరిపోలుతున్నందున, టైటన్ నీటిలో మునుగుతుండగా దాని ప్రెజర్ హల్ (Pressure hull) అంతఃస్ఫోటనానికి గురయ్యి, లోపలున్న ఐదుగురూ కూడా ఆకస్మికంగా మరణించారు.

ఈ వెదుకులాటలో అమెరికా, కెనడాల తీర రక్షక దళాలూ, అమెరికా నావికా దళాలూ పాల్గొనగా[1], రొయల్ కెనడియన్ ఎయ్ర్ ఫోర్స్, యునైటెడ్ స్టెయ్ట్స్ ఎయ్ర్ నెషనల్ గార్డ్, రొయల్ కెనడియన్ నెయ్వి షిప్ వంటి ప్రభుత్వ బలగాలతో పాటు ఎన్నో వర్తక నౌకలూ, పరిశోధనా నౌకలూ, ROVలూ వీరికి సహాయం అందించాయి.[2][3]

ఈ పడవను తయారు చేసినప్పుడు చాలా మంది నిపుణులు ఈ పడవ సురక్షితం కాదని అభిప్రాయపడ్డారు. ఐతే అతిగా ఉన్న భద్రతా నియమాలూ, పద్ధతులూ నవీకరణను నీరుగారుస్తున్నాయని వాదించిన ఓషన్‌గెయ్ట్ సంస్థ, ఈ పడవకు ఏ ధ్రువీకరణ సంస్థల నుండీ ధ్రువీకరణ పొందలేదు.[4]

నేపథ్యం[మార్చు]

ఓషన్‌గెయ్ట్[మార్చు]

టైటన్‌కు ముందు ఓషన్‌గెయ్ట్ తయారుచేసిన మొట్టమొదటి నిప్పుకోడి పడవ సైక్లొప్స్ 1.

ఓషన్‌గెయ్ట్ అనేది స్టొక్టన్ రష్, గియెర్మొ సొన్‌లెయ్న్‌లు 2009లో నెలకొల్పిన ఒక వైయక్తిక సంస్థ. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న ఎవరెట్ నగరం కేంద్రంగా గల ఈ సంస్థ,[5] 2010 నుండి ఈ సంస్థ వినియోగదారుల్ని అద్దెకు తీసుకున్న వాణిజ్య నిమజ్జక నౌకల్లో కెలిఫొర్నియా తీరం, మెక్సికో సింధుశాఖా, అట్లాన్టిక్ మహాసముద్రాల్లో తిప్పేది.[6]

నౌకా శిథిలస్థలాలకు పర్యటనలు వార్తామాధ్యమాల దృష్టిని ఆకర్షిస్తున్నాయని రష్ గ్రహించడంతో, ఈ సంస్థ ఈ పర్యటనలను మొదలుపెట్టింది. సైక్లొప్స్ 1 పర్యటనల్లో ముఖ్యమైనది 2016లో ఏన్‌డడ్రేయ డోర్య శిథిల స్థలానికి జరిగిన పర్యటన. 2019లో రష్ స్మిత్‌సొన్యన్ పత్రికతో మాట్లాడుతూ "అందరికీ తెలిసిన శిథిలస్థలం ఒక్కటే...నీటికింద ఏముంటాయి అని మీరు జనాలని అడిగితే సొరచేపలూ, తిమింగలాలూ, టైటనిక్ అని బదులు వస్తుంది".[6]

టైటనిక్[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Unified Command established for missing submersible from Polar Prince". United States Coast Guard. 20 June 2023. Archived from the original on 21 June 2023. Retrieved 21 June 2023.
  2. Petri, Alexandra E.; Lin, Summer (19 June 2023). "Titanic tourist submersible carrying 5 disappears on trip to see wreck in North Atlantic". Los Angeles Times. Archived from the original on 19 June 2023. Retrieved 20 June 2023.
  3. Liebermann, Oren; Britzky, Haley (20 June 2023). "US military moving military and commercial assets to help submersible search efforts". CNN. Archived from the original on 21 June 2023. Retrieved 20 June 2023.
  4. Bogel-Burroughs, Nicholas; Gross, Jenny; Betts, Anna (20 June 2023). "OceanGate Was Warned of Potential for 'Catastrophic' Problems With Titanic Mission". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 21 June 2023. Retrieved 21 June 2023.
  5. Podsada, Janice (19 December 2021). "For $250K, this Everett company will take you to the Titanic". The Everett Herald. Archived from the original on 23 June 2023. Retrieved 22 June 2023.
  6. 6.0 6.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Smithsonian అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు