2023 భారత రెజ్లర్ల నిరసన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ రెజ్లర్ల నిరసనలు
నిరసన తెలుపుతున్న భారతీయ రెజ్లర్లు
తేదీ2023 జనవరి 18 – ప్రస్తుతం
(1 సంవత్సరం, 3 నెలలు , 2 రోజులు)
స్థలంజంతర్ మంతర్, న్యూఢిల్లీ, భారతదేశం
కారణాలుభారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు
లక్ష్యాలు
  • నిందితుల అరెస్ట్
  • పర్యవేక్షణ కమిటీ నివేదికను బహిరంగపరచాలి
  • రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు
పద్ధతులుధర్నా, కొవ్వొత్తుల ప్రదర్శన[1]
పౌర ఘర్షణల్లో పాల్గొన్న పక్షాలు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా

  • భారత ప్రభుత్వం
  • మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్
  • స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
  • ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్

భారత రెజ్లర్లు, రాజకీయేతర సంస్థలు

  • ఖాప్ పంచాయతీలు[2][3]
  • సంయుక్త్ కిసాన్ మోర్చా[4][5]
  • భారతీయ కిసాన్ యూనియన్[6]

మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు:
భారత జాతీయ కాంగ్రెస్
ఆమ్ ఆద్మీ పార్టీ
తృణమూల్ కాంగ్రెస్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్)
రాష్ట్రీయ లోక్ దళ్
ఇండియన్ నేషనల్ లోక్ దళ్

ద్రవిడ మున్నేట్ర కజగం
ముఖ్య నాయకులు
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
వినీష్ ఫోగట్
సాక్షి మాలిక్
బజరంగ్ పూనియా
సంగీతా ఫోగట్
సత్యవర్త్ కడియన్
సోమ్వీర్ రాథీ

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ప్రముఖ భారతీయ రెజ్లర్ లు నిరసనలు కొనసాగిస్తున్నారు.[7][8][9]

రెజ్లర్ల నిరసన జనవరి 2023లో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించారు. ఆరోపణలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చిన తర్వాత నిరసనలు విరమించబడ్డాయి. కమిటీ నివేదికను 2023 ఏప్రిల్ 5న సమర్పించారు. అయితే అందులోని విషయాలేవి బహిరంగపరచలేదు. దీంతో రెజ్లర్లు అధికారులు చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ 2023 ఏప్రిల్ 23న తమ నిరసనను పునఃప్రారంభించారు.[7]

సంఘటనలు[మార్చు]

జనవరి 18:

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, సరిత మోర్‌, సంగీత ఫొగాట్‌, సత్యవర్త్‌ మలిక్‌ సహా అనేక మంది మేటి రెజ్లర్లు న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు దిగారు.[10]

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ 2011 నుంచి పదవిలో కొనసాగుతుండగా ఫిబ్రవరి 2019లో మూడోసారి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తిరస్కరించాడు. పదవి నుంచి దిగిపోవడానికి నిరాకరించాడు.[10]

జనవరి 20:

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో విచారణకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.[11]

లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఐఓఏ కమిటీని నియమించడం, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో రెజ్లర్ల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు రావడంతో నిరసన విరమించారు.[11]

జనవరి 21:

రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో క్రీడల మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటీసుకు డబ్ల్యూఎఫ్‌ఐ జవాబిచ్చింది. లైంగిక వేధింపులు సహా అధ్యక్షుడుపై వచ్చిన ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది.[12]

మే 28:

న్యూఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు అక్కడికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించారు.

మే 29:

గత 38 రోజులుగా జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లను ఇకపై అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వారు నగరంలోని మరో అనువైన ప్రదేశాన్ని దీక్ష కోసం ఎంచుకోవాలని సూచించారు.[13]

మే 30:

తాము సాధించిన పతకాలను హరిద్వార్‌లోని గంగా నదిలో ఈ రోజు కలిపేస్తామని రెజ్లర్లు నిర్ణయించుకున్నారు. అనంతరం ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.[14]

హరిద్వార్‌లో బైఠాయించిన రెజ్లర్లు స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు 5 రోజుల గడువు విధించారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.[15]

మే 31:

మహిళా రెజ్లర్ల నిరసన కార్యక్రమాలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు స్పందించారు. వారి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. తుది నివేదికను కోర్టుకు 15 రోజుల్లోగా సమర్పిస్తామన్నారు.[16]

జూన్ 7:

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు ఈ రోజు తాత్కాలిక విరామం ప్రకటించారు. అతనిపై ఈ జూన్ 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది.[17]

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Indian wrestlers hold candlelight march demanding arrest of sports official for sexual abuse".
  2. "Wrestlers vs WFI chief: Khap Panchayats, protesting wrestlers issue 10-day ultimatum to Centre".
  3. https://thefederal.com/states/north/delhi/wrestlers-stir-in-message-of-unity-haryanas-khaps-are-entering-the-ring/
  4. "Samyukta Kisan Morcha to hold nationwide protests in support of wrestlers, Delhi Police beefs up security". The Hindu. 7 May 2023.
  5. https://www.outlookindia.com/sports/leaders-of-samyukta-kisan-morcha-meet-protesting-wrestlers-at-jantar-mantar-photos-284349
  6. "Wrestlers' Protest Day 12: BKU farmers clash with police at Jantar Mantar". 8 May 2023.
  7. 7.0 7.1 Karthikeyan, Suchitra (28 April 2023). "Wrestlers vs WFI sexual harassment row |From Jantar Mantar to the Supreme Court, the story so far". The Hindu. Retrieved 2023-04-28.
  8. "Vinesh Phogat: India wrestlers seek chief's arrest over sexual abuse claims". BBC. 2023-04-24. Retrieved 2023-04-25.
  9. Kumar, Hari; Travelli, Alex (2023-05-05). "Indian Olympians Persist in Demanding Arrest of Wrestling Chief". The New York Times. Retrieved 2023-05-11.
  10. 10.0 10.1 "రోడ్డెక్కిన కుస్తీ యోధులు |". web.archive.org. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. 11.0 11.1 "మేరీకోమ్‌ సారథ్యంలో విచారణ కమిటీ |". web.archive.org. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. "అన్నీ అబద్ధాలే.. |". web.archive.org. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. "జంతర్‌మంతర్‌లో కుదరదు |". web.archive.org. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "Wrestlers Protest: మా పతకాలను నేడు గంగలో కలిపేస్తాం.. రెజ్లర్ల హెచ్చరిక | we will throw our medals in river ganga wrestlers". web.archive.org. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  15. "Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్‌ | wrestlers halt plan to immerse medals in ganga give ultimatum for action". web.archive.org. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  16. "Wrestlers : బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్ల ఆరోపణలు.. ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటన.. | delhi police clarified that media reports about brij bhushan wrestlers case are wrong yvr". web.archive.org. 2023-05-31. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  17. "రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక విరామం |". web.archive.org. 2023-06-11. Archived from the original on 2023-06-11. Retrieved 2023-06-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)