బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2009
ముందు బేణి ప్రసాద్ వర్మ
నియోజకవర్గం కైసర్‌గంజ్
పదవీ కాలం
2004 – 2009
ముందు రిజ్వాన్ జహీర్
తరువాత శ్రావస్తి నియోజకవర్గం
నియోజకవర్గం బలరాంపూర్
పదవీ కాలం
1999 – 2004
ముందు కీర్తి వర్ధన్ సింగ్
తరువాత కీర్తి వర్ధన్ సింగ్
నియోజకవర్గం గోండా
పదవీ కాలం
1991 – 1996
ముందు ఆనంద్ సింగ్
తరువాత కేత్కీ దేవి సింగ్
నియోజకవర్గం గోండా

వ్యక్తిగత వివరాలు

జననం (1957-01-08) 1957 జనవరి 8 (వయసు 67)
గోండా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (1991-2008, 2014-ప్రస్తుతం)
సమాజ్‌వాదీ పార్టీ (2008-2014)
జీవిత భాగస్వామి కేత్కీ దేవి సింగ్
సంతానం 4, ప్రతీక్ భూషణ్ సింగ్‌తో సహా
నివాసం గోండా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
మూలం https://www.india.gov.in/my-government/indian-parliament/brijbhushan-sharan-singh

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2011 నుంచి రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఎన్నికై 15 లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదురుకొని రెజ్లింగ్‌ వ్యవహారాల నుంచి తప్పుకుంటున్నట్లు 2023 డిసెంబరు 24న ప్రకటించాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

బ్రిజ్ భూషణ్ 1980ల్లో విద్యార్థి దశలో రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత రామ జన్మభూమి ఉద్యమంలో భాజపా అగ్రనేత ఎల్. కే అడ్వాణీతో కలిసి విస్తృతంగా పాల్గొని ఈ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లడంతో స్థానికంగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన 1991 లోక్‌సభ ఎన్నికల్లో గోండా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్ భూషణ్ ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ ఎంపీగా ఎన్నికై కొన్ని కారణాలతో బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు.

బ్రిజ్ భూషణ్ 2009లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికై తిరిగి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీలో చేరి కైసర్‌గంజ్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 ఎన్నికల్లోనూ కైసర్‌గంజ్ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచాడు. బ్రిజ్ భూషణ్ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుడిగా ఉండగా 2020లో కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది.

డ‌బ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడిగా[మార్చు]

బ్రిజ్ భూషణ్ చిన్నప్పటి నుంచే కుస్తీమీద ఆసక్తితో కుస్తీ నేర్చుకొని పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఆయనకు అప్పటి మల్ల యోధులు జనార్ధన్ సింగ్, రామ్ అస్రే, రామచంద్ర, గంగా ప్రసాద్ వంటి వారితో సత్సంబంధాలున్నాయి. బ్రిజ్ భూషణ్ 2011లో తొలిసారి భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి 12 ఏళ్లుగా అదే హోదాలో పనిచేసాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు.[2]

బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలిపారు. వీరి ధర్నాకు విపక్ష పార్టీలు & స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘల నాయకులు పాల్గొని మహిళా రెజ్లర్లకు అండగా నిలిచారు. బ్రిజ్ భూషణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమైన అనంతరం 2023 డిసెంబరు 24న రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Eenadu (24 December 2023). "'రెజ్లింగ్‌' నుంచి రిటైర్మెంట్‌.. బ్రిజ్‌ భూషణ్‌ కీలక ప్రకటన". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  2. BBC News తెలుగు (19 January 2023). "మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్న బ్రిజ్ భూషణ్ ఎవరు". Retrieved 26 December 2023.
  3. Mana Telangana (25 December 2023). "రెజ్లింగ్‌కు బ్రిజ్ భూషణ్ గుడ్‌బై!". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.