బలరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°24′0″N 82°12′0″E మార్చు
పటం

బలరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఐదు అసెంబ్లీ స్థానాలతో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1957లో సాధారణ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేశారు. అతను మథురలో నాల్గవ స్థానంలో, లక్నోలో రెండవ స్థానంలో నిలిచి మొదటిసారిగా బలరాంపూర్‌ లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు. ఆయన 1962లో బలరాంపూర్ & లక్నో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయి 1967లో బలరాంపూర్ నుంచి పోటీ చేసి గెలిచాడు.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 ఏర్పడలేదు
1957 అటల్ బిహారీ వాజ్‌పేయి [2] భారతీయ జనసంఘ్
1962 సుభద్ర జోషి భారత జాతీయ కాంగ్రెస్
1967 అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనసంఘ్
1971 చంద్ర భల్ మణి తివారీ భారత జాతీయ కాంగ్రెస్
1977 నానాజీ దేశ్‌ముఖ్ జనతా పార్టీ
1980 చంద్ర భల్ మణి తివారీ భారత జాతీయ కాంగ్రెస్
1984 మహంత్ దీప్ నారాయణ్ వాన్ భారత జాతీయ కాంగ్రెస్
1989 ఫాసి-ఉర్-రెహ్మాన్ మున్నాన్ ఖాన్ స్వతంత్ర
1991 సత్య దేవ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1996 సత్య దేవ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1998 రిజ్వాన్ జహీర్ సమాజ్ వాదీ పార్టీ
1999 రిజ్వాన్ జహీర్ సమాజ్ వాదీ పార్టీ
2004 బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2008 లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పడింది.

మూలాలు[మార్చు]

  1. The New Indian Express (18 August 2018). "Balrampur: Vajpayee started out as an MP from this constituency". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. NDTV (17 August 2018). "Atal Bihari Vajpayee Started Out As A Lawmaker From This Constituency". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]