ప్రతీక్ భూషణ్ సింగ్
Jump to navigation
Jump to search
ప్రతీక్ భూషణ్ సింగ్ | |
---|---|
ఉత్తర ప్రదేశ్ శాసనసభ | |
Assumed office 2017 | |
అంతకు ముందు వారు | వినోద్ సింగ్ |
నియోజకవర్గం | గొండ అసెంబ్లీ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గొండా, ఉత్తర ప్రదేశ్ | 1988 మే 9
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | రాజశ్రీ సింగ్ (m. 2011) |
బంధువులు | కరణ్ భూషణ్ సింగ్ (సోదరుడు) |
తల్లి | కేతకీ దేవి సింగ్ |
తండ్రి | బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ |
నివాసం | గోండా, ఉత్తరప్రదేశ్ |
కళాశాల | డా. రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (ఎల్.ఎల్.బి.) మెల్బోర్న్ విశ్వవిద్యాలయం (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) |
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రతీక్ భూషణ్ సింగ్ (జననం 1988 మే 9) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను గోండాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2వ టర్మ్ సభ్యుడు.[1][2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రతీక్ భూషణ్ సింగ్ కైసర్‌గంజ్ నియోజకవర్గం నుండి ఎన్నికైన బిజెపి ఎంపి కరణ్ భూషణ్ సింగ్ సోదరుడు. అతను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కేతకీ దేవి సింగ్ దంపతుల కుమారుడు. ఆయన తండ్రి ఆరు సార్లు కైసర్‌గంజ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపి, అలాగే తల్లి గోండా నియోజకవర్గం నుండి మాజీ లోక్‌సభ ఎంపీ.
ఆయన 2011లో డాక్టర్ రాజశ్రీ సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో, ఆయుధాల చట్టం కింద నిషేధించబడిన మందుగుండు సామగ్రిని కలిగి ఉన్నందుకు, చట్టవిరుద్ధంగా ఎర్ర బీకాన్ అమర్చిన కారులో ప్రయాణించినందుకు రాజస్థాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Gonda Election Results 2017: Prateek Bhushan Singh of BJP Wins". news18.com. 11 March 2017. Retrieved June 16, 2024.
- ↑ Singh, Prateek Bhushan. "Gonda Election Results 2017: Prateek Bhushan Singh of BJP Wins".
- ↑ "Brij Bhusan's son arrested in Barmer". The Times of India. 2011-03-28. ISSN 0971-8257. Retrieved 2023-05-26.
- ↑ "MP's son, two others sent to judicial custody, arms seized". The Times of India. 2011-03-28. ISSN 0971-8257. Retrieved 2023-05-26.