వినోద్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోద్ కుమార్ సింగ్
ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడు
In office
2012–2017
మినిస్టర్రవాణా శాఖ మంత్రి(2012-2013). విద్యాశాఖ మంత్రి(2014-2015) వ్యవసాయ శాఖ మంత్రి(2015-2016)
అంతకు ముందు వారుమోహన్ జలిఖాన్
తరువాత వారుభూషణ్ సింగ్
నియోజకవర్గంగొండా శాసనసభ నియోజకవర్గం
ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
1996–2007
మినిస్టర్ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి(2003-2007)
అంతకు ముందు వారుతులసీదాస్
నియోజకవర్గంగొండా శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1962 జనవరి 7
గొండా ఉత్తరప్రదేశ్ భారతదేశం
మరణం2021 మే 7
లక్నో ఉత్తరప్రదేశ్ భారతదేశం
రాజకీయ పార్టీసమాజ్ వాది పార్టీ
జీవిత భాగస్వామిసోనా సింగ్
నివాసంగొండా
As of 2019 సెప్టెంబర్ 17

వినోద్ కుమార్ సింగ్ అలియాస్ పండిత్ సింగ్ [1] ( 1962 జనవరి 7 - 2021 మే 7 [2] ) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మూడుసార్లు సమాజ్‌వాది పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఉత్తర ప్రదేశ్ శాసనసభలో గోండా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు [3] వినోద్ సింగ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినోద్ సింగ్ మంత్రిగా పనిచేశాడు. వినోద్ సింగ్ 2019 పార్లమెంట్ ఎన్నికలలో గోండా నియోజకవర్గం పోటీ చేశాడు కానీ బిజెపికి చెందిన కీర్తి వర్ధన్ సింగ్ చేతిలో ఓడిపోయాడు.[3] వినోద్ సింగ్ 59 సంవత్సరాల వయస్సులో కోవిడ్-19 సంబంధిత సమస్యలతో 2021 మే 7న మరణించాడు.[1][4]

వినోద్ సింగ్ మృతి పట్ల పలువురు ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా పలువురు రాజకీయ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.[3][5]

రాజకీయ జీవితం

[మార్చు]

వినోద్ సింగ్ రాజకీయ జీవితం 1995లో ప్రారంభమైంది. 1996లో వినోద్ సింగ్ గోండా శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంలో విద్యా వైద్యారోగ్య శాఖ మంత్రిగా వినోద్ సింగ్ పనిచేశాడు. 2012లో వినోద్ సింగ్ మళ్లీ గోండా ఎమ్మెల్యేగా ఎన్నికై అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 2013 అక్టోబరులో వినోద్ సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేసాడు తరువాత వినోద్ సింగ్ ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయ్యాడు. 2014లో వినోద్ సింగ్ కైసెర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేతిలో ఓడిపోయాడు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Mishra, Arun (May 7, 2021). "यूपी: सपा नेता व पूर्व मंत्री विनोद कुमार सिंह 'पंडित सिंह' का निधन, कोरोना से थे संक्रमित". specialcoveragenews.in (in హిందీ).
  2. "पूर्व मंत्री पंडित सिंह के निधन के बाद बेटे सूरज की भी तबीयत बिगड़ी, लखनऊ ले जाने की सलाह". Hindustan (in hindi). Retrieved 2022-10-07.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 3.2 Samarth Srivastava (May 7, 2021). "Former UP cabinet minister Vinod Kumar Singh dies of Covid-19 complications". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-03-03.
  4. Samarth Srivastava (May 7, 2021). "Former UP cabinet minister Vinod Kumar Singh dies of Covid-19 complications". India Today.
  5. "सपा नेता और पूर्व मंत्री विनोद कुमार उर्फ पंडित सिंह का कोरोना से निधन, 20 दिन से चल रहा था इलाज". News18 हिंदी (in హిందీ). 2021-05-07. Retrieved 2022-03-03.