26/11 ముంబై పై దాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాజ్ హోటల్, ముంబై

2008లో దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో కాల్పులు, బాంబు దాడులు చేశారు.[1][2] 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, [3] తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్, [3] లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, [3] యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, [4] మెట్రో సినిమా హాల్, [5] టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో, సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి.[3] ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో, విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.[6]

ఉగ్రవాద దాడుల సమయంలో ముంబై పోలీసు కమీషనర్ హసన్ గఫూర్ నాయకత్వం సరిగా లేదన్న ఆరోపణలతో రామ్ ప్రధాన్ కమీషన్ నివేదికలో అభియోగాలు మోపబడడంతో హసన్ గపూర్ ముంబై పోలీసు కమీషనర్ హోదా నుండి మహారాష్ట్ర పోలీస్ హౌసింగ్, వెల్ఫేర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేయబడ్డాడు.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

భారత్‌లో ఉగ్రవాద ఘటనల జాబితా

మూలాలు

[మార్చు]
  1. Friedman, Thomas (2009-02-17). "No Way, No How, Not Here". The New York Times. Retrieved 2010-05-17.
  2. Indian Muslims hailed for not burying 26/11 attackers, Sify News, 2009-02-19, archived from the original on 2010-10-23, retrieved 2010-10-19
  3. 3.0 3.1 3.2 3.3 "Wave of Terror Attacks Strikes India's Mumbai, Killing at Least 182". Fox News. 2008-11-27. Retrieved 2008-12-03.
  4. Kahn, Jeremy (2008-12-02). "Jews of Mumbai, a Tiny and Eclectic Group, Suddenly Reconsider Their Serene Existence". New York Times. Retrieved 2008-12-03.
  5. Magnier, Mark (2008-12-03). "Mumbai police officers describe nightmare of attack". Los Angeles Times. Retrieved 2008-12-03.
  6. "Tracing the terror route". Indian Express. 2008-12-10. Archived from the original on 2009-05-28. Retrieved 2008-12-09.
  7. "D Sivanandan to be new police chief of Mumbai". The Times of India. June 14, 2009. Archived from the original on 15 June 2009. Retrieved 2020-09-19.