29వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
29వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on10-20 జనవరి 1998
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ది కింగ్ ఆఫ్ మాస్క్స్"

29వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1998 జనవరి 10 నుండి జనవరి 20 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఆసియా డైరెక్టర్లు తీసిన సినిమాలతోనే ఈ ఫెస్టివల్ జరిగింది.[2][3]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు

[మార్చు]
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "వు టియాన్మింగ్" దర్శకత్వం వహించిన "ది కింగ్ ఆఫ్ మాస్క్స్" (చైనీస్ సినిమా)
  • ఉత్తమ చిత్రం: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఫర్హాద్ మెహ్రాన్ఫర్" దర్శకత్వం వహించిన "పేపర్ ఎయిర్ ప్లేయిన్స్" (ఇరానియన్ సినిమా)
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: సిల్వర్ నెమలి: " సంత్వానా బార్డోలోయ్" అస్సామీ సినిమా "అదజ్య"[3]

మూలాలు

[మార్చు]
  1. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 3 July 2021.
  2. "Light In The Haze". Retrieved 3 July 2021.
  3. 3.0 3.1 http://www.frontline.in/static/html/fl1503/15030800.htm
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.