36వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
36వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | డిసెంబరు 4, 2005 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "ఐరన్ ఐలాండ్" |
36వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2005 నవంబరు 24 నుండి డిసెంబరు 4 గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2] ఈ చిత్రోత్సవం ఫ్రెంచ్ సినిమాపై దృష్టి పెట్టింది.[3] నటులు దేవానంద్, చిరంజీవి ఈ చిత్రోత్సవాన్ని ప్రారంభించారు.[4] 36వ చిత్రోత్సవం మొదటిసారి విజ్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చేత అమలు చేయబడింది.[5] లాటిన్ అమెరికన్ సినీ దర్శకుడు మిగ్యుల్ లిట్టిన్, ఫ్రెంచ్ దర్శకుడు అలైన్ కార్నియా, సినీ దర్శకుడు సయీద్ మీర్జా, ఇరాన్ నటుడు-దర్శకుడు ఫరామార్జ్ ఘారిబియన్, ఆస్ట్రియన్ సినీ దర్శకుడు సబీన్ డెర్ఫ్లింగర్ తదితరులు జ్యూరీలో ఉన్నారు.[6]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[7][8] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[9]
విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "మొహమ్మద్ రసౌలోఫ్" దర్శకత్వం వహించిన "ఐరన్ ఐలాండ్" (ఇరానియన్ చిత్రం)
- మోస్ట్ ప్రామిసింగ్ ఆసియా దర్శకుడికి సిల్వర్ పీకాక్ అవార్డు: "కెరాప్ అండ్ డ్రీమ్‌లెస్" అర్జెంటీనా సినిమా దర్శకులు "వెరా ఫాగ్‌విల్", "మార్టిన్ డెసాల్వో"
- ప్రత్యేక జ్యూరీ అవార్డు: సిల్వర్ పీకాక్:"టామ్ హూపర్" దర్శకత్వం వహించిన "రెడ్ డస్ట్" (దక్షిణాఫ్రికా చిత్రం).[6]
అధికారిక ఎంపికలు
[మార్చు]ప్రత్యేక ప్రదర్శనలు
[మార్చు]ముగింపు సినిమా
[మార్చు]- "జీన్-పియరీ", "లూక్ డార్డెన్" దర్శకత్వం వహించిన "ఎల్'ఎన్ఫాంట్" సినిమా
మూలాలు
[మార్చు]- ↑ "National : Rane to inaugurate IFFI 2005 festivities". The Hindu. 2005-11-14. Retrieved 2021-06-30.
- ↑ "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2015-03-23. Retrieved 2021-06-30.
- ↑ "36th IFFI: The Big Picture – Content and digitisation will drive growth". Archived from the original on 2018-03-19. Retrieved 2021-06-30.
- ↑ "IFFI: Bit of a damp squib". Retrieved 2021-06-30.
- ↑ "IFFI Goa 2005 to commemorate the magic of French Cinema". Archived from the original on 2018-03-19. Retrieved 2021-06-30.
- ↑ 6.0 6.1 "Front Page : `Jazireh Ahani' bags Golden Peacock". The Hindu. 2005-12-05. Retrieved 2021-06-30.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.