Jump to content

39వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
39వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on22 నవంబరు - 1 డిసెంబరు, 2008
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంతుల్పాన్

39వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 2008 నవంబరు 22 నుండి 2008 డిసెంబరు 1 వరకు గోవాలోని పనాజీలో జరిగింది.[1]

2008, డిసెంబరు 02న గోవాలోని పనాజీలో 39వ ఐఎఫ్ఎఫ్ఐ -2008 సందర్భంగా ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి, సినీ నటుడు శ్రీ కమల్ హాసన్ ప్రసంగించాడు.

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[2][3] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[4]

విజేతలు

[మార్చు]
కమల్ హాసన్ దర్శకుడు సెర్గీ డ్వోర్ట్‌వాయ్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డును అందజేశారు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "తుల్పాన్" "ద్వారా సర్జీ డ్వోర్ట్సేవాయ్"
  • ప్రత్యేక జ్యూరీ అవార్డు: "ఆకాసా కుసుమ్" చిత్రానికి "మలాని ఫోన్సెకా"
  • అత్యంత ప్రామిసింగ్ డైరెక్టర్: "సర్జీ డ్వోర్ట్సేవాయ్" చిత్రం కోసం "తుల్పాన్"

జ్యూరీ

[మార్చు]
  • నికి కరిమి
  • టబు
  • మార్కో ముల్లెర్
  • లావ్ డియాజ్
  • పీటర్ హో-సన్ చాన్

పోటీదారులు

[మార్చు]

పోటీ విభాగంలో 15 చిత్రాలు ఉన్నాయి[5]

  • మై మదర్ టీయర్స్
  • రూపంట్
  • ది షాఫ్ట్
  • కాంచీవరం
  • మహాసత్త
  • ది సాంగ్ ఆఫ్ స్పారోస్
  • ది రెడ్ స్పాట్
  • తుల్పన్
  • పెన్సిల్
  • ప్లానింగ్
  • ఆకాస కుసుం
  • ది కోఫిన్

మూలాలు

[మార్చు]
  1. "IFFI 2008 kicks off with 'Warlords' in Goa". The Economic Times. 22 November 2008. Retrieved 2021-06-27.
  2. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  3. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  4. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
  5. "IFFI 2008 kicks off in Goa". The Hindu. 22 November 2008. Archived from the original on 2012-11-07. Retrieved 2021-06-27.

బయటి లింకులు

[మార్చు]