6వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
6వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on16 జనవరి 1977
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"బ్రదర్ అండ్ సిస్టర్"

6వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1977 జనవరి 3 నుండి జనవరి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] విదేశీ చలన చిత్రోత్సవాలలో అవార్డులు గెలుచుకున్న భారతీయ చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రత్యేకంగా నిలిచాయి.[2] ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, లఘుచిత్రానికి సిల్వర్ పీకాక్ అవార్డులతోపాటు తొలిసారిగా ఉత్తమ లఘుచిత్రానికి కాంస్య నెమలి అవార్డను ఏర్పాటుచేసింది. ఈ ఎడిషన్ నుండి ప్రతి ఏటా జనవరి 3–17 ఈ చిత్రోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించబడింది. "ఇండియన్ మోషన్ పిక్చర్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్" (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మొదటిసారిగా ఒక ఫిల్మ్ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఎడిషన్ నుండి "ఇండియన్ పనోరమా విభాగం" స్థాపించబడింది.[3]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు

[మార్చు]
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: తదాషి ఇమై దర్శకత్వం వహించిన "బ్రదర్ అండ్ సిస్టర్" (జపనీస్ సినిమా)
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "ఆఫ్టర్ ది సైలెన్స్" (భారతీయ సినిమా)

మూలాలు

[మార్చు]
  1. "6th International Film Festival of India" (PDF). Archived from the original (PDF) on 2017-05-02. Retrieved 4 July 2021.
  2. "English Releases". Retrieved 4 July 2021.
  3. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 4 July 2021.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 4 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 4 July 2021.