5వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
5వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 12 జనవరి 1975 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "డ్రీమింగ్ యూత్" |
5వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1974 డిసెంబరు 30 నుండి 1975 జనవరి 12 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] భారత జాతీయ పక్షి నెమలిని సూచించే శాశ్వత చిహ్నాం ఈ ఐదవ చిత్రోత్సవంలో ఏర్పాటుచేశారు. "వసుధైవ కుటుంబకం" (ప్రపంచం మొత్తం ఒక కుటుంబం) శాశ్వత నినాదంతో ఈ చిత్రోత్సవం జరిగింది. అదే సంవత్సరంలో భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రత్యామ్నాయంగా "ఫిల్మోత్సవ్" పేరుతో పోటీలేకుండా సినిమా ప్రదర్శన కూడా నిర్వహించాలని నిర్ణయించారు.[2]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[3][4] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[5]
విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: జెనోస్ రోజ్సేస్ దర్శకత్వం వహించిన "డ్రీమింగ్ యూత్" (హంగేరియన్ సినిమా)
- ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: ఆటోమేటిక్ (చెకోస్లోవాకిన్ సినిమా)
మూలాలు
[మార్చు]- ↑ "English Releases". Retrieved 4 July 2021.
- ↑ "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 4 July 2021.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 4 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 4 July 2021.