Jump to content

4వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
4వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on18 డిసెంబరు 1969
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ది డామెండ్"

4వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1969 డిసెంబరు 5 నుండి డిసెంబరు 18 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఈ చిత్రోత్సవాన్ని అప్పటి భారత రాష్ట్రపతి వి.వి.గిరి ప్రారంభించాడు. ముప్పై నాలుగు దేశాలు పాల్గొన్న ఈ చిత్రోత్సవంలో సినిమాలు కళ, సినిమాలు కమ్యూనికేషన్, ప్రత్యేక లఘు చిత్రాలు అనే మూడు విభాగాల క్రింద సినిమాలు వర్గీకరించబడ్డాయి.[2] లఘు చిత్రాలు ఈ ఎడిషన్ నుండే ప్రారంభమయ్యాయి.

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[3][4] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[5]

విజేతలు

[మార్చు]
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: లుచినో విస్కోంటి దర్శకత్వం వహించిన "ది డామెండ్" (ఇటాలియన్ సినిమా)
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "టేకింగ్ ఆఫ్ ఎట్ 1800 అవర్స్" (క్యూబన్ స)
  • లఘు చిత్రం: సిల్వర్ పీకాక్ అవార్డు: సుగతపాల సేనరత్ యాపా దర్శకత్వం వహించిన "మ్యాన్ అండ్ ది క్రో" (శ్రీలంక సినిమా)

మూలాలు

[మార్చు]
  1. "English Releases". Retrieved 4 July 2021.
  2. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 4 July 2021.
  3. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 4 July 2021.
  4. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 July 2021.
  5. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 4 July 2021.