Jump to content

3వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
3వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on21 జనవరి 1965
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంగంపేరియ

3వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1965 జనవరి 8 నుండి జనవరి 21 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1][2] భారతదేశంలో నిర్వహించిన తొలి చిత్రోత్సవం ఇది. సత్యజిత్ రే అధ్యక్షతన జరిగిన ఈ చిత్రోత్సవాన్ని అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించాడు. పారిస్ కు చెందిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ప్రొడ్యూసర్స్ డి ఫిల్మ్స్ వారు దీనిని 'ఎ' కేటగిరీగా గ్రేడ్ గా నమోదు చేశారు. ఈ గుర్తింపుతో కేన్స్, బెర్లిన్, వెనిస్, కార్లోవీ వారీ, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలతో సమానంగా నిలిచింది.[3]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు

[మార్చు]
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "గంపేరియ" (శ్రీలంక సినిమా)
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "సైక్లోన్" (క్యూబన్ సినిమా)

ప్రారంభ సినిమా

[మార్చు]
  • "నికోలా వాల్చెవ్" దర్శకత్వం వహించిన "ఇవాయిలో"

ముగింపు సినిమా

[మార్చు]
  • "ఎలియా కజాన్" దర్శకత్వం వహించిన "అమెరికా అమెరికా"

మూలాలు

[మార్చు]
  1. "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. the original (PDF) నుండి 2016-08-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2021.
  2. "International Film Festival in India". rrtd.nic.in. the original నుండి 21 November 2004 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2021.
  3. "One of Asia's First Film Festivals – IFFI over the years". International Film Festival of India, Goa. 3 October 2017. the original నుండి 17 November 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2021.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2021.

బయటి లింకులు

[మార్చు]