9వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
9వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on16 జనవరి 1983

9వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1983 జనవరి 3 నుండి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఈ చిత్రోత్సవంలో 16 ఎంఎం చిత్రాల ప్రదర్శన కోసం కొత్త విభాగం ప్రవేశపెట్టబడింది. ఇందులో ఇరవై రెండు ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి, మూడవ ప్రపంచ సినిమాకు ఈ చిత్రోత్సవం ప్రధాన వేదికగా మారింది. మొదటిసారి ఉత్తమ చలన చిత్రంకు గోల్డెన్ పీకాక్ అవార్డులు ఇవ్వలేదు, పోటీ విభాగంలో లఘుచిత్రంకు అవార్డులు లభించలేదు.[2][3]

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు[మార్చు]

  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: అవార్డు ఇవ్వలేదు
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: అవార్డు ఇవ్వలేదు

మూలాలు[మార్చు]

  1. "English Releases". Retrieved 5 July 2021.
  2. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 5 July 2021.
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2015-12-27. Retrieved 5 July 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 5 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 5 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 5 July 2021.