చర్చ:గోరా
ఒడిషా రాష్ట్రం గంజుం జిల్లాలోని ఛత్రపురంలో 1902, నంబర్ 15న వెంకటసుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు గోరా జన్మించారు. పర్లా కిమిడిలో ప్రాథమిక వి ద్యాభాసం పూర్తిచేసిన ఆయన 1913లో పిఠాపురం రాజా కాలేజి హైస్కూల్‌లో చదివారు. 1920లో పి.ఆర్. కాలేజ్‌లో ఇంటర్ పూర్తిచేసిన గోరా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభంలో ఆ ఉద్యమంలోకి వెళ్లారు. 1922లో మద్రాసు ప్రెసిడెన్షి కళాశాలలో వృక్షశాస్త్రంలో బిఏ చేశారు. తర్వాత మధురలోని మిషన్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో కాటన్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, తర్వాత కొలంబోలోని ఒక కళాశాలలో బయాలజీ అధ్యాపకునిగా, 1928లో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928లో భార్యపిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చాడు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో తనకు పుట్టిన బిడ్డకు లవణం అని నామకరణం చేశారు. తర్వాత సంతానానికి సమరం, నియంత, విజయం తదితర పేర్లను గోరా తమ పిల్లలకు పెట్టుకున్నారు. గోరా సతీమణి సరస్వతి గోరా కూడా భర్త అడుగుజాడల్లో నడిచారు. స్వతంత్ర భావాలుగల గోరా ఎక్కడా ఉద్యోగంలో నిలువలేకపోయాడు. 1940, ఆగస్టు 10న కృష్ణా జిల్లా ముదునూరులో ప్రపంచంలోని మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని 80 మంది యువకులతో గోరా ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభంతో గోరా జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది. 1940 నుంచి 1944 వరకు అక్షరాస్యత, అస్పృశ్యత, సహపంక్తి భోజనాలు వంటి ఉద్యమాలు మడనూరు చుట్టుపక్కల నిర్వహించారు. 1944లో గాంధీ కోరికమేర అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాద్, ఢిల్లిలో పనిచేశారు. 1947 ఏప్రిల్‌లో తన కార్యాలయాన్ని విజయవాడలోని పడమటకు మార్చారు. స్వాతంత్య్ర సమరయోధునిగానేకాక, సాంఘిక, ఆర్థిక సమానత్వ సాధనకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కుల, మత తత్వాల నిర్మూలనకు అనితర కృషి గోరా సల్పారు. మహాత్మాగాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి, అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేసారు. దళితుల దేవాలయ ప్రవేశాన్ని, సమిష్టి భోజనాలను, వివాహాలను విస్తృతంగా ఆయన నిర్వహించారు. ఈ విధంగా సాంఘిక సమానత్వ సాధనకు పెద్దఎత్తున కృషి చేయడమేకాక నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా ప్రతిపాదించారు. దైవకేంద్ర సమాజం నుంచి మానవ కేంద్రం సమాజంవైపు పురోగమించడానికి మతానంతర సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఎంతగానో తపించారు. 1949, జనవరి 30న గోరా సంపాదకత్వంలో 'సంఘం' తొలి సంచిక వెలువడింది. ఆ తరువాత గాంధీ పేరుతో సంఘం స్థాపించాడు. 1962-63లో భారతదేశమంతా పర్యటించి పార్టీ రహిత ప్రజాస్వామ్యం, నిరాడంబరత్వం గురించి విశేష ప్రచారం చేశాడు. పార్టీరహిత ప్రజాస్వామ్య సిద్ధాంతంపై ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఒకే వేదికపైకి తెచ్చి కామన్ ప్లాట్‌ఫారం పద్ధతి ప్రవేశపెట్టిన ఘనత గోరాదే. సెక్యులర్ వ్యవస్థతో పాటు నాస్తికత్వ వ్యాప్తికీ గోరా ఐదు ఖ ండాలలో విస్తృతంగా పర్యటించారు. స్వంత ఆస్తి అనేది లేకుండా, పూర్తిగా ప్రజలపై ఆధారపడి తన కార్యక్రమాలు కొనసాగించారు. 1968 జనవరిలో 'ది ఏథిస్ప్' అనే ఇంగ్లీషు మాసపత్రిక ప్రారంభించి అంతర్జాతీయ సంబంధాలు పెంచుకున్నారు. 1972లో విజయవాడలో మొట్టమొదటి ప్రపంచ నాస్తిక మహాసభలను నిర్వహించారు. అదేవిధంగా 1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడలో నిర్వహించగా, 3వ ప్రపంచ నాస్తిక మహాసభలు ఫిన్లాండ్ రాజధాని హెల్పింక్‌లో నిర్వహించారు. 1975, జూలై 26న విజయవాడలో భారత గ్రామీణ సమాజంలో మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై ప్రసంగిస్తూనే గోరా తుదిశ్వాస వదిలారు
గోరా
[మార్చు]వ్యాసం శీర్షిక "గోపరాజు రామచంద్ర రావు (గోరా): అని ఉండటం సముచితం. రవీంద్రనాథ్ టాగూర్ వ్రాసిన "గోరా" అనే నవల లోక ప్రసిధ్ధం. ఆ కారణాన, కేవలం "గోరా" అని శీర్షిక ఉంటె, ఈ వ్యాసం ఆ నవల గురించేమో అనుకునే అవకాశం హెచ్చు. పైగా గోరా అనేది గోపరాజు రామచంద్రరావు వారి ఇంటిపేరు వారి పేరు కలిపి ఏర్పడ్డ హ్రస్వనామం అర్ధాత్ అబ్రీవియేషన్ను ఆయన తన ప్రసిధ్ధ నామంగా స్వేకరించారు తప్ప, అది వారి పేరు కాదు.
- రెండు విషయాలండి: 1. సాధారణంగా ఏ పేరు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉంటుందో ఆ పేరునే వికీపీడియాలో వాడాలనేది ఇక్కడి నియమం. గోరా గారు గోపరాజు రామచంద్రరావు గా కంటే గోరా గానే ఎక్కువ ప్రసిద్ధులు కాబట్టి ఈ పేజీ పేరు గోరా అనే ఉండాలని నా అభిప్రాయం. 2. ఒకే పేరుతో పలు వ్యాసాలుండడం తెవికీలో మామూలే. ఉదాహరణకు "ముదునూరు" అనే పేరుతో రెండు పేజీలున్నై - ముదునూరు (వుయ్యూరు) (గోరా గారు నాస్తిక కేంద్రాన్ని స్థాపించిన ముదునూరు), ముదునూరు (పెంటపాడు). పేజీ పేరును స్పష్టంగా తెలపడం కోసం బ్రాకెట్లో క్వాలిఫై చేసారు. అలాగే టాగూరు నవల గోరా గురించి భవిష్యత్తులో పేజీ పెట్టాల్సి వస్తే "గోరా (నవల)" అనో "గోరా (బెంగాలీ నవల)" అనో పేరు పెడతారు. __చదువరి (చర్చ • రచనలు) 01:42, 29 ఆగస్టు 2024 (UTC)
గోరా నాస్తికుడుగా మారటానికి కారణాలు ఏమిటి?
[మార్చు]గోరా తండ్రి గొప్ప భక్తి గేయ రచయిత. వారి కీర్తనలు ఇప్పటికీ ఆకాశవాణి వారు ప్రసారం చేస్తూనే ఉన్నారు. తండ్రి అటువంటి భక్తి పరాయుణుడు అయి ఉండగా, కుమారుడు గోరా నాస్తికుడిగా మారిపోవటానికి బలమైన కారణాలు ఏమిటి వ్యాసంలో కవర్ చేస్తే బాగుంటుంది.
వ్యాసంలో ఒకచోట "తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928లో భార్యపిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చాడు" అని ఉన్నది. అంటే భక్తి మార్గంలో ఉన్న తండ్రి, తన కుమారుడు గోరా నాస్తికుడు అయిపోవటం నచ్చి ఉండక ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చి ఉండవచ్చు. కానీ, గోరా నాస్తికుడు అవటానికి కారణం తండ్రి భక్తి మార్గమేనా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం వ్యాసంలో లేకపోవటం పెద్ద లోపం.
- నిజమే పై సమాచారం కూడా ఉంటే వ్యాసం మరింత సమగ్రంగా ఉంటుంది. కానీ ఈ సమాచారం ఎక్కడైనా విశ్వసనీయమైన ప్రాథమికేతర వనరుల్లో లభిస్తోంటే, ఆ సమాచారాన్ని ఇక్కడ ఆ మూలాన్ని ఉదహరిస్తూ రాయవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 02:54, 29 ఆగస్టు 2024 (UTC)
Thank you for your response. Shri Samaram, who is also a very famous Doctor lives in Vijayawada and if any of Wikipedians contacts Shri Samaram, he may throw more light on the life of his father Shri Gora. In doing so, he may give a clue why his father became an Athiest, while his grand father was such a devout Hindu.
కుటుంబ నేపధ్యం
[మార్చు]గోరా ఒరిస్సాలో జన్మించారని వ్యాసంలో ఉన్నది. వీరు, ఒరిస్సాకు చెందిన తెలుగు కుటుంబమా, లేక వారి తండ్రి ఒరిస్సాలో పనిచేస్తుండగా గోరా వారికి జన్మించారా? వివరాలు లేవు. విజయవాడ పటమటకు ఎందుకు చేరారు. పర్లాకిమిడికి విజయవాడాకు చాలా దూరం! వీరిది అసలు కృష్ణా జిల్లానా?
ఉద్యోగ వివరాలు
[మార్చు]గోరా కొలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారని వ్యాసంలో ఉన్నది. ఏ కొలంబో? శ్రీలంక రాజధాని కొలంబోయేనా? కొలొంబోలో ఏ కాలేజీ? 115.98.112.119 00:27, 29 ఆగస్టు 2024 (UTC)
సంతానం
[మార్చు]గోరా తన కుమారులకు వారు పుట్టినప్పటి ప్రపంచ, దేశ పరిస్థితులకు అద్దం పడుతూ విలక్షణమైన పేర్లు పెట్టాడు అని వ్రాసినప్పుడు, ఒక్కొక్కరికీ వారి పేరు ఆ పక్కనే ఆ పేరు పెట్టటానికి గల అప్పటి చారిత్రిక కారణం ఒక టేబుల్ గా ఇస్తే బాగుంటుంది. It will be easy to read and gets highlighted.
సరస్వతి గోరా
[మార్చు]క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవించారు: ఏ తేదీనుంచి ఏ తేదీ వరకు, ఏ జైలులోనో వివరాలు ఏమిటో వ్రాస్తే Authenticated information గా ఉండే అవకాశం ఉన్నది.
"...ఆచార్య వినోబాభావే చేపట్టిన...":వినోభా భావే గురించి తెలుగు వికిపీడియాలో వ్యాసం ఉంటే క్రాస్ లింక్ ఇస్తే బాగుంటుంది.
- వినోభా భావే గురించి తెలుగు వికిపీడియాలో వ్యాసం ఉంటే క్రాస్ లింక్ ఇస్తే బాగుంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 02:56, 29 ఆగస్టు 2024 (UTC)
గోరా వంశవృక్షం
[మార్చు]కేవలం వంశ వృక్షం ఇచ్చి ఉపయోగం ఏమిటి! గోరా ఆశయాలను ఒక్కొక్క తరంలోనూ (ఐదు తరాలను కవర్ చేశారు) ఎవరు, ఎంతవరకూ ఆచరించి ముందుకు నడిపించారు/ఇంకా నడిపిస్తున్నారు వివరాలు ఇస్తే వంశ వృక్షం ఇచ్చినందుకు ఒక ఉపయోగం ఉంటుంది.
- కేవలం వంశ వృక్షం ఇచ్చి ఉపయోగం ఏమిటి - దేని ప్రయోజనం దానికుంటుంది. ఇతర సమాచారం కూడా ఇస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, నిజమే. కానీ, అది లేకపోతే మిగతాది నిష్ప్రయోజనమని అనుకోరాదు. __చదువరి (చర్చ • రచనలు) 02:59, 29 ఆగస్టు 2024 (UTC)