దీనిలో మనం వ్రాసినదాన్ని కనీసం మనమైనా ఎడిట్ చేసుకునే అవకాశంతో పాటుగా ఎవరైనా కొత్తవారు వచ్చి ప్రయోగాత్మకంగా రచ్చబండపై తెలుగు నేర్చుకోవడాల్లాంటివి రివర్ట్ చేసేందుకూ వీలున్నట్టూ లేదు. కేవలం ఫ్లాగ్ గుర్తుతో దాచు కనిపిస్తోంది. సభ్యులు తాము వ్రాసిన అస్పష్టమైన చర్చను మరింత స్పష్టంగా చేసేందుకు సభ్యునికి ఎడిట్ చేసుకునే వీలులేకపోతే అనవసర చర్చల్లోకి దారితీయొచ్చు. అలానే రివర్ట్ లేకపోయినా ఇబ్బందే. ఇంతకీ ఈ దాచు ప్రయోజనమేంటి?
Topic on వికీపీడియా చర్చ:ఫ్లో/Flow
స్వరూపం
మరో విషయం.. నాకు ఈ ఫ్లో విధానం మౌలికంగా నచ్చింది. ఇదంతా దాన్ని మెరుగుపరుచునేందుకు, మరింతగా అభివృద్ధి చేసి సచేతనం చేయించుకునేందుకు చేస్తున్న చర్చగా అర్థంచేసుకోగలరు.