Jump to content

వాడుకరి:Muhammad Rahaman Ali

వికీపీడియా నుండి
రహమాన్ అలీ
B.A, B.PEd, B.Ed, HW B/S

జీవించుట ప్రతి మనిషికి సులభం!
జీవిస్తూ జయించుట కొందరికే సాధ్యం!!
ఏదో ఓ రంగంలో మెరుస్తారు కొందరూ
ఎన్నెన్నో రంగాల్లో..ఇంద్ర ధనుస్సు లెందరు
జననం28-06-1943
నివాస ప్రాంతంతిరుమలగిరి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ, తెలంగాణ
వృత్తిరిటైర్డ్ ఫిసికల్ డైరెక్టర్
ప్రసిద్ధిక్రీడాకారుడు, నటుడు, దర్శకుడు, ప్రయోక్త, రచయిత, స్కౌట్ మాస్టారు, సామజిక సంస్కర్త.
భార్య / భర్తరెహాన
పిల్లలుఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు
తండ్రిముహమ్మద్ ఫాజిల్

రహమాన్ అలీ ముహమ్మద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారుడు, నటుడు, దర్శకుడు, ప్రయోక్త, రచయిత, స్కౌట్ మాస్టారు, సామజిక సంస్కర్త.

జీవించుట ప్రతి మనిషికి సులభం!
జీవిస్తూ  జయించుట కొందరికే సాధ్యం
ఏదో ఓ రంగంలో మెరుస్తారు కొందరూ
ఎన్నెన్నో రంగాల్లో ఇంద్ర ధనుస్సు లెందరు?
నీ జీవిత మైదానంలో ఆడు.. ఆడించు!
నీలోని నిలువెత్తు కళలను పంచూ.. రంజించు!!
సామాజిక రంగంలో రవ్వంతా పరిమళించు!!!
జీవి"తరంగ" అలల కలల అలరించి మురిపించు!!!!
అసూయానురాగాలను లోతుల్లో సమాధిచేశాను.
సహనం, సంయనంతో ఆసాంతం సాధించాను.
విధి నిర్వహణకు అంకితమై స్నేహానురాగాల పంచాను.
శిష్యానురాగాల్లో, యువ, జనాభిమానంలో తరించాను.
On the occassion of Natara Academy 9th Anuual Celebration, received Sevaa Ratna Award for the year 2018 at Ravindra Brarathi
Honor by District Collector Sri. K.Surendra Mohan on the occasionof Inter National Senior Citizen's Day to my services on 8th Oct 2017
జీవితరంగ సాఫల్య వివరణలు
స్కౌట్ కార్యక్రమములు
  • ప్రధానమంత్రి షీల్డ్ పోటీలు 1977 మొరార్జీదేశాయి ప్రశంసాపత్రము
  • VIII వ జాతీయ జాంబూరి 1979 తమిళనాడు
  • స్టేట్ క్యాంపూరి 1980 సికింద్రాబాద్
  • HWB రీ యూనియన్ క్యాంపు 1981 విశాఖపట్నం
  • బ్యాడ్జ్ ఇన్స్ట్రక్షన్ 1981 హైద్రాబాద్
  • XVI వ జాతీయ జాంబూరి 1983 బెంగళూరు
  • XVI స్టేట్ క్యాంపూరి 1984 గుంటూరు
  • X ఆసియన్ పసిఫిక్ జాంబూరి 1987 గండిపేట, హైద్రాబాదు
  • HWB రీ యూనియన్ క్యాంపు 1992 జీడిమెట్ల, హైద్రాబాదు
అవార్డులు

"ప్రధానమంత్రి షీల్డ్ పోటీలు విజేత"
1977 మొరార్జీదేశాయి మాజీ ముఖ్యమంత్రి

"యువజనబంధు"
1979 మిత్రమండలి దేవరుప్పుల, జనగాం జిల్లా

"సిల్వర్ మెడల్"
1981 జనాభా గణన - మినిస్ట్రీ అఫ్ హోమ్ ఎఫైర్స్ - ఇండియా

"నట ప్రశంసాభిషేకం"
1986 విజయభాను కళా సమితి - సూర్యాపేట

"మెడల్ అఫ్ ఆనర్"
1988 జామున సినీనటి మోత్కూరులో

"లాంగ్ సర్వీస్ మెడల్"
స్కౌట్ మాస్టర్ శ్రీ ఏ. మాధవరెడ్డి, హోం మినిస్టర్, ఏ.పి.పరేడ్ గ్రౌండ్స్, నల్లగొండ

"స్టేట్ అవార్డు"
1991 సెన్సెస్ - నర్సింహారావు, జిల్లా కలెక్టర్, నల్లగొండ

"ఉత్తమ నటుడు దర్శకుడు"
1992 స్నేహ కళా సమితి

"మెడల్స్ & సర్టిఫికెట్స్"
1997 జన్మభూమి మండల స్థాయిలో

"నటుడు ఉత్తమ దర్శకుడు"
2001 గుండు హనుమంతరావు, సినీ నటుడు - మోత్కూర్

సన్మాన సత్కారాలు

"ఉత్తమ క్రీడాపాధ్యాయుడు"
5-9-1985 "గురుపూజోత్సవం" జిల్లాస్థాయి, శ్రీ ఏ.కే.గోయల్, జిల్లా కలెక్టర్, నల్లగొండ

"ఉత్తమ స్కౌట్ మాస్టర్"
5-9-1989 "గురుపూజోత్సవం" జిల్లాస్థాయి, జిల్లా విద్యాశాఖాధికారి, నల్లగొండ

"ఉత్తమ నటుడు - దర్శకుడు"
1988 శ్రీ మోహన్ రెడ్డి, డి.డి.ఏ నల్లగొండ

"ఉత్తమ నటుడు - దర్శకుడు"
1988 శ్రీమతి జమున, సినీనటి - వృత్తి కళాకారుల సంఘం మోత్కూరు

"ఉత్తమ సామజిక భావుకుడు"
1989 శ్రీ ఏ మాధవరెడ్డి, హోం మినిస్టర్ ఏ.పి "తారక దానోర్యము" మోత్కూరు

ఉత్తమ క్రీడాపాధ్యాయుడు, నటుడు, దర్శకుడు"
1992 శ్రీ ఆర్.దామోదర్ రెడ్డి, మంత్రివర్యులు, ఏ.పి ప్రెస్ క్లబ్, సూర్యాపేట డివిజన్

"ఉత్తమ క్రీడాపాధ్యాయుడు"
5-9-1995 గురుపూజోత్సవం - శిల్ప టీవీ నటి, మోత్కూరు

ఉత్తమ క్రీడా కళాకారుడు"
శ్రీ బి.ఎన్.రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యుడు, సూర్యాపేట
తెలంగాణ సమరయోధుల సంఘం, అర్వపల్లి

"ఉత్తమ మండల కోఆర్డినేటర్"
సంపూర్ణ అక్షరాస్యత తేదీ 5 -9 -1996 గురుపూజోత్సవం
శ్రీ రంగారెడ్డి, మండల రెవిన్యూ అధికారి, తిరుమలగిరి

ఉత్తమ నటుడు - దర్శకుడు"
1998 శ్రీ అలీ & ఉతేజ్ - సినీనటులు, అభినయ కళా సమితి, మోత్కూరు

"ఉత్తమ సాహితీ శష్ట, నటుడు, దర్శకుడు"
"ఉగాది పురస్కారం" అక్షర కళాభారతి, చౌటుప్పల్, 2004

""నటుడు - దర్శకుడు" ప్రయోక్త
స్వర్ణోత్సర వేడుకలు, అభినయ కళాసమితి, మోత్కూరు 2015
శ్రీ బూర నర్సయ్య గౌడ్, పార్లమెంట్ సభ్యుడు, వర్రె వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమీషనర్ గారులచే

"ఉత్తమ నటుడు - దర్శకుడు" ఆదర్శకుడు
"మన్మధ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం" చింతల స్వచ్చంద సంస్థ, మోత్కూరు 2015 - శ్రీ అశోక్ తేజ గారిచే

"ఉత్తమ నటుడు - దర్శకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు"
"మన్మధ ఉగాది పురస్కారం" వాసవి క్లబ్, తిరుమలగిరి

"ఉత్తమ సాహితీ సష్ట"
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2015 , మండల పురస్కారం

సామాజిక కార్యక్రమములు

గాంధీ జయంతి
వృత్తి ధర్మంగా స్కౌట్ పిల్లలు, యువకులతో గ్రామంలో పరిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ

గృహ నిర్మాణము
ఒక పేద మనిషి జనార్దన్ కు 1987 సం.లో బి.సి కాలనీ తిరుమలగిరిలో స్కౌట్ విద్యార్థుల కృషితో మండల రెవిన్యూ అధికారి సహకారంతో ఇంటి నిర్మాణము

తుఫాను బాధితులు
1977 , 1983 లో విరాళాలు సేకరించి సి.ఎం రిలీఫ్ ఫండుకు పంపనైనది

బతుకుల్లో చదువు వెలుగు
సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంగా స్వంత ఖర్చులతో నల్లగొండ, వరంగల్ జిల్లాల కొన్ని మండలాలలో స్నేహ కళా సమితి ద్వారా ప్రదర్శించనైనది

మండల కో ఆర్డినేటర్ గా
పూర్తి సమయము నియామకమై 15 గ్రామ పంచాయితీలలో 786 కేంద్రములలో 7860 అక్షరాస్యుల గావించుటకు కృషి చేయనైనది

మద్యపాన నిషేధ కమిటీ
సభ్యునిగా చైతన్యవంత కార్యక్రమాలు - నాటికల ద్వారా, ఉపన్యాసాల ద్వారా లంబాడి తండాలలో ప్రదర్శించి, వివరించి సారాయి బట్టీలను, సంబంధిత అధికారుల సహాయముతో నిర్ములింపజేయనైనది

నిర్మాణములు
పనిచేసిన పాఠశాలలు తిరుమలగిరి, ఫణిగిరి, మోత్కూరు లో నాటిక పారదర్శన డబ్బులతో, లయన్స్ క్లబ్ సహాయముతో సర్పంచుల సహకారముతో వేదికలు నిర్మించనైనది

క్రీడా - సాంస్కృతిక కార్యక్రమాలు
గ్రామీణ యువకుల, విద్యార్థుల సామర్ధ్యములను ఆసక్తిని పెంపొందించుటకై కృషి సల్పుతూ నిర్వహించనైనది

నటన - దర్శకత్వం
ద్వారా జాతీయ భావన, సామజిక బాధ్యతల వివరిస్తూ గ్రామ పట్టణ స్థాయిలో "స్నేహ కళా సమితి" కళాకారుల ద్వారా ప్రదర్శనలు పలుచోట్ల ప్రదర్శించనైనది

నిర్వహణ - ప్రయోక్త
ప్రభుత్వ ప్రభుత్వేతర పలు కార్యక్రమాల్లో సలహాలు అందిస్తూ ప్రయోక్తగా హుందాగా పలు కార్యక్రమములు నిర్వహించి ప్రశంసలందుకోనైనది

రాసిన కొన్ని కవితలు మరియు తెలుగు వార్తా పత్రిక ప్రచురనలు
ప్రేమతో కొడుకు రాసిన కవిత్వం

వృత్తిని ఆరాధించిన వ్యక్తివి నీవు
స్వార్ధం లేకుండా పుట్టించిన పరమాత్మ సృష్టివి నీవు
క్రమశిక్షణగల అధ్యాపక సైనికుడివి నీవు
నైపుణ్య నవరత్న సవ్యసాచివి నీవు
సత్యమేవ జగతికే నిలువెత్తు సాక్షివి నీవు

సమయ పాలన, విధి నిర్వహణ ధ్యేయంగా
ఉన్న ఊరిలో ఉద్యోగం అయినా
పాతిక మైళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చినా
ముప్ఫై యేడు సంవత్సరాల సర్వీసులో
ప్రార్ధనకు బంకు కొట్టకుండా
కష్టపడకుండా జీతం తీసుకోకుండా
అంకిత భావం అర్పిత భావం కల్గిన
వృత్తికి వత్తిగా నిల్చిన వజ్రానివి నీవు

స్వాతంత్ర గణతంత్ర్య దినోత్సవాలల్లో
ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లను కలుపుకుని
కలర్ పార్టీ స్కౌటులతో, విద్యార్ధుల మార్చుఫాస్టులతో
విన్యాసాలతో, వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలతో
బడికి, ఊరికి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి
తనదైన శైలిలో మెప్పించిన దేశ ప్రేమికుడివి నీవు

కోడిబోయిందమ్మలారా కోడిబోయింది
చిలుకలున్న చింత మీద వజనాల వాన కురిసె
జానపదాలు రచించి, పాడి
ప్రేక్షకుల రంజింప చేసిన జ్ఞాపకానివి నీవు

ఊబి, సాయ, ఊరుమ్మడి బతుకుల పాత్రలలో మీ నటన
మరిచి పోలేని జ్ఞాపికలు
జంగబిల్లి, ఉద్యమించండి, కిడ్నాప్, సోమరులారా చావండి
నాటకాల దర్శకత్వం ఆ దశాబ్ద నెమరికలు

త్యాగరాజ గానసభ, రవీంద్ర భారతిలో
'నీలిదీపాల' ప్రదర్శనలతో
స్నేహ కళా సమితి శిష్య కళాకారుల ఆధ్వర్యంలో
పాతిక గ్రామాల్లో అక్షర ప్రదర్శనలతో
కల ప్రజలకోసం, మార్పు కోసం, మానవత్వ వికాసం కోసం
సమానత్వం, సామజిక న్యాయం కోసం అని నిరూపించి
ఎందరో కళాకారుల్లో స్ఫూర్తిని రంగరించిన మీరు

చదివి చదివి అలసిన విద్యర్ధినీ విద్యార్ధులకు
వ్యాయామంతో వినోదాన్ని పంచిన విధాతవి నీవు

ఐదు వేల రూపాయి, ఐదు వేల డాలర్ లు తేడా లేకుండా
నా మొదటి స్వదేశీ, విదేశీ జీతాన్ని
గరీబులకి పంచిన దయా గుణం నీవు

ఇహలోక, పరలోక జ్ఞానము కలిగి
సృష్టించిన సృష్టికర్తను మరువకుండా
హజ్ ఉమ్రాల కోసం పలుమార్లు
మక్కా, మదీనాలను సందర్శించిన
అల్లాహ్ బానిసవు నీవు

పున్నమి చంద్రుడివి నీవు, పరిపూర్ణతకి అర్ధం నీవు
పేరులోనే పేరుకుపోయిన సహనం, సంస్కారం
కరుణాదయగల ప్రషంసా పాత్రుడవు నీవు
శిష్యానురాగంలో, ప్రజాభిమానంలో
అధికారుల మన్ననలో
తరించి ఎన్నో అవార్డులు వరించగా
గర్వంలేని నిమ్మల నిర్మలతత్వం గల
ముహమ్మద్ రహమాన్ అలి సారువు నీవు