Jump to content

అంబస్స

అక్షాంశ రేఖాంశాలు: 23°55′10.8″N 91°50′42″E / 23.919667°N 91.84500°E / 23.919667; 91.84500
వికీపీడియా నుండి
అంబస్స
జనగణన పట్టణం
అంబస్స is located in Tripura
అంబస్స
అంబస్స
భాతరదేశంలోని త్రిపురలో ప్రాంతం ఉనికి
అంబస్స is located in India
అంబస్స
అంబస్స
అంబస్స (India)
Coordinates: 23°55′10.8″N 91°50′42″E / 23.919667°N 91.84500°E / 23.919667; 91.84500
దేశం భారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాదలై
భాషలు
 • అధికారికమిజో
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
799289
Vehicle registrationటిఆర్-04

అంబస్స, త్రిపుర రాష్ట్రంలోని దలై జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] అంబస్స పట్టణంలో 6,052 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాలో 54% మంది పురుషులు, 46% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 70% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఈ అక్షరాస్యతలో 60% మంది పురుషులు, 40% స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

2011 ప్రకారం 16,285 జనాభా ఉండగా అందులో 8,523 మంది పురుషులు, 7,762 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 1,867 (11.46%) మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు 95.86% కాగా, రాష్ట్ర సగటు 87.22% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 97.42% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 94.12% గా ఉంది.[2]

పరిపాలన

[మార్చు]

ఈ పట్టణాన్ని 9 వార్డులుగా విభజించారు. ఇక్కడ మొత్తం 4,062 ఇళ్లకు పైగా ఉన్నాయి. పట్టణ అభివృద్ధి సంస్థ త్రాగునీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తోంది. రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా పట్టణ అభివృద్ధి సంస్థకు అధికారం ఉంది.[2]

గ్రామాలు

[మార్చు]

అంబస్స పట్టణ పరిధిలో 35 గ్రామాలు ఉన్నాయి.[3]

  1. ఆలిరైపారా
  2. బాగ్మారా
  3. బలరాం
  4. బలూచర
  5. బటాబరి
  6. చక్మపర
  7. దంగమపర
  8. గంగానగర్
  9. గంగప్రసాద్పారా
  10. గురుధన్‌పారా
  11. హరిమంగల్పారా
  12. జగన్నాథ్పూర్
  13. కమలాచర
  14. కాంచనపూర్
  15. కర్మపార
  16. కర్ణమణిపర
  17. కథల్‌బరి
  18. ఖాముపారా
  19. ఖోవైపారా
  20. కులై
  21. కులైఆర్.ఎఫ్.
  22. కులైఆర్.ఎఫ్.
  23. లాల్‌చారా
  24. లాల్చారి
  25. పస్చిమ్నలిచర
  26. పూర్బానలిచర
  27. పుస్టరైపారా
  28. రాధరాంబరి
  29. రాయ్పాసా
  30. సర్దింఖపారా
  31. సత్భాయపర
  32. సిద్ధపారా
  33. సికారిబారి
  34. టెటయ్య
  35. ఉలేమ్‌చారా

రవాణా

[మార్చు]

అంబస్స పట్టణానికి, రాష్ట్ర రాజధాని అగర్తలాకు 82 కి.మీ.ల దూరం ఉంది. ఈ పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు రోడ్డుమార్గం ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాలు నడుపబడుతున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. 2.0 2.1 "Ambassa Nagar Panchayat City Population Census 2011-2020 | Tripura". www.census2011.co.in. Retrieved 2020-12-29.
  3. "Villages & Towns in Ambassa Block of Dhalai, Tripura". www.census2011.co.in. Retrieved 2020-12-29.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అంబస్స&oldid=3944483" నుండి వెలికితీశారు