అఖండజ్యోతి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నిరంతరం వెలిగే జ్యోతిని అఖండజ్యోతి అంటారు. కొన్ని దేవాలయాలలో అఖండ జ్యోతిని వెలిగించి నిరంతరం దానిని సంరక్షిస్తుంటారు. ఈ అఖండజ్యోతిని పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు, పూజిస్తారు, ఈ దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనంను ఉచితంగా అందజేస్తారు. ఈ అఖండ జ్యోతిని పూజించడం వలన శుభం జరుగుతుందని నమ్ముతారు. దీపపు కుందె లలో వత్తులను ఉంచి, దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనంగా నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి, నువ్వులనూనె మిశ్రమం, లేదా ఆముదమును ఉపయోగిస్తారు. దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ప్రాణవాయువు గాలి అందేలా ఈదురు గాలుల నుంచి, వానల నుంచి సంరక్షించేందుకు తగిన ప్రదేశంలో భద్రపరుస్తారు.