అనంత బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతబాబు
శాసనమండలి సభ్యుడు
Member of the U.S. House of Representatives
from 's కాకినాడ జిల్లా district
వ్యక్తిగత వివరాలు
జననం
అనంత ఉదయ భాస్కర్

మే 22
రాజకీయ పార్టీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

అనంత సత్య ఉదయ భాస్కర్, అనంత బాబు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించాడు.

బాల్యం

[మార్చు]

అనంతబాబు తండ్రి అనంత చక్రరావు అడ్డతీగల పంచాయితీ మాజీ అధ్యక్షుడు. 1986లో పీపుల్స్ వార్ నక్సల్స్ చేతిలో కాల్చి చంపబడ్డాడు.[1][2]

నేర కార్యకలాపాలు

[మార్చు]

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్ల తగిలింపు సంఘటనలో అనంత బాబు ప్రమేయం ఉందని పోలీస్ కేసు నమోదు అయింది. గతంలో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దాడి దాడి చేశారని ఇతడి పై అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా విశాఖపట్నం ఏజెన్సీలో మహిళలు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఇతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

రాజకీయ జీవితం

[మార్చు]

అనంత బాబుకు నేర చరిత్ర ఉందని, రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు ధర్నా చేశారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. తన నామినేషన్‌లో భాగంగా, తాను షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు పొందిన కొండ కాపు వర్గానికి చెందినవాడినని పేర్కొంటూ ఎన్నికల అఫిడవిట్ సమర్పించాడు. అయితే గిరిజనులు ఇతను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి అభ్యంతరాన్ని పరిశీలించి, చివరకు అనంతబాబు పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ తెగకు చెందిన వారు కాదని తేల్చి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.[3] రంపచోడవరం నియోజకవర్గంలో వంతల రాజేశ్వరి దేవి ఎమ్మెల్యేగా ఉన్న పెత్తనమంతా అనంత బాబుదే అన్న విమర్శలు వచ్చాయి. 2021లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల నుంచి ఏకగ్రీవంగా శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.[4][5]

సుబ్రహ్మణ్యం హత్య

[మార్చు]

సుబ్రహ్మణ్యానికి రాత్రి సుమారు 9:30 గంటలకు ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. అయితే, మే 20, శుక్రవారం తెల్లవారుజామున, తెల్లవారుజామున 2 గంటలకు, సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అతని కుటుంబానికి తిరిగి ఇచ్చారు, అతను ప్రమాదంలో మరణించాడని బూటకపు కథ అల్లాడు.[6] అనంత బాబు పై సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అనుమానం మొదలైంది.

డబ్బులకు సంబంధించి అనంతబాబు సుబ్రహ్మణ్యం మధ్య సంభాషణ జరిగింది. అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని కొట్టడంతో వాగ్వాదం కాస్తా వివాదానికి దారితీసింది, దీంతో అనంతబాబు సుబ్రహ్మణ్యం పై ఇనపరాడుతో తలపై కొట్టాడు. సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది. చివరకు గాయాలపాలై సుబ్రహ్మణ్యం మృతి చెందగా, అనంతబాబు హత్యను రోడ్డు ప్రమాదంగా మార్చేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే సుబ్రహ్మణ్యం చనిపోయాడని గుర్తించిన అనంతబాబు.. ప్రమాదం కారణంగానే మృతి చెందినట్లు కనిపించేందుకు అతడిని కారులో నుంచి తోసేశాడు.[7]

ఎమ్మెల్సీ సీక్రెట్‌లు, కంపెనీలు, ఇతర కార్యకలాపాలు సుబ్రహ్మణ్యానికి తెలుసని, తన మాజీ డ్రైవర్ ఈ రహస్యాలను బయటపెడతాడనే భయంతో ఎమ్మెల్సీ అతడిని హత్య చేశాడని ఆరోపణలు వచ్చాయి.

మూలాలు

[మార్చు]
  1. Irshad (2022-05-23). "MLC Anantha Babu: Endless Stories of Anantha Babu .. From Colored Stones to Dead Body Door Delivery .. | Driver subramanyam murder case news update who is mlc anantha babu - PiPa News" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-06.
  2. Aravind (2022-05-24). "MLC Anantha Babu sent for 14 days Custodial Remand | Anantha Babu News". www.andhrawishesh.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-05-27. Retrieved 2023-05-27.
  3. "In the High Court of Judicature Andhra Pradesh at Hderabad, R. Kantha Rao, J. Anantha Udaya Bhaskar Rao v. Election Commission of India, New Delhi and others".
  4. "YSRCP candidate Udaya bhaskar elected unopposed as Local bodies constituency MLC".
  5. "Member's Information - Legislative Council - Liferay DXP". aplegislature.org. Retrieved 2023-05-08.[permanent dead link]
  6. "CCTV footage: Twist on MLC Anantha Babu driver Subramanyam murder case". ap7am.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.
  7. "Andhra MLA Arrested On Charge Of Killing His Driver: Police". NDTV.com. Retrieved 2023-05-06.
"https://te.wikipedia.org/w/index.php?title=అనంత_బాబు&oldid=4357753" నుండి వెలికితీశారు