ఆంగోతు బిందు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంగోతు బిందు

పదవీ కాలం
2019 ఆగష్టు 8 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1996
బాల్యాతండ, బయ్యారం మండలం, మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు శ్రీకాంత్‌ నాయక్, కాంతి
బంధువులు సత్యవతి రాథోడ్ (చిన్నమ్మ)
వృత్తి రాజకీయ నాయకురాలు

ఆంగోతు బిందు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా భాద్యతలు నిర్వహిస్తుంది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఆంగోత్ బిందు 1996లో తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌ జిల్లా, బయ్యారం మండలం, బాల్యాతండాలో శ్రీకాంత్‌ నాయక్, కాంతి దంపతులకు జన్మించింది. ఆమె 2018లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసింది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ఆంగోత్ బిందు తన చిన్నమ్మ సత్యవతి రాథోడ్ స్పూర్తితో రాజకీయాల్లో వచ్చింది. ఆమె 2018లో బీటెక్‌ పూర్తికాగానే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా 2019లో జిల్లా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రావటం మహబూబాబాద్‌ జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చైర్మన్ స్థానం ఎస్.టి రిజర్వేషన్‌ కావడంతో ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున బయ్యారం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.[3][4]

మూలాలు[మార్చు]

  1. HMTV (8 June 2019). "తెలంగాణాలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌/ ఛైర్మన్లుగా ఎన్నికైంది వీళ్లే." Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  2. Sakshi (28 July 2019). "'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  3. Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  4. News18 Telugu (8 June 2019). "జడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు...32 స్థానాలు క్లీన్ స్వీప్". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)