ఆకు కదలని చోట
ఆకు కదలని చోట | |
కృతికర్త: | బాలసుధాకర్ మౌళి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | వచన కవితా సంపుటి |
ప్రచురణ: | సిక్కోలు బుక్‌ట్రస్ట్, శ్రీకాకుళం |
విడుదల: | సెప్టెంబర్, 2016 |
పేజీలు: | 136 |
ఆకు కదలని చోట కవితా సంపుటిని కళింగాంధ్ర యువకవి బాలసుధాకర్ మౌళి రచించాడు. ఈ పుస్తకం వల్ల ఇతనికి 2018 సంవత్సరానికి గాను కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారం ప్రకటించారు.
కవి పరిచయం
[మార్చు]బాలసుధాకర్ మౌళి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో జన్మించాడు. ఇతడు విజయనగరం జిల్లాలోని గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఇతడు ఎగరాల్సిన సమయం, ఆకు కదలని చోట అనే కవితా సంపుటులు, తన విద్యార్థుల కవితలతో స్వప్నసాధకులు అనే కవితా సంకలనం, బడి చెప్పిన కథలు అనే కథాసంపుటి వెలువరించాడు. ఇతనికి సాహిత్య అకాడమీ యువ పురస్కారంతో పాటుగా భారత భాషా పరిషత్ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు మొదలైన అనేక పురస్కారాలు లభించాయి.
ఈ పుస్తకంలో
[మార్చు]ఈ కవితాసంపుటిలో మొత్తం 62 కవితలు ఉన్నాయి.[1] వాటిలో 5 కవితలు వివిధ భాషలనుండి అనువదించబడ్డాయి. మిగిలిన కవితలలో 27 కవితలు ఏదో ఒక సందర్భాన్నో, వ్యక్తులనో తలచుకుంటూ వ్రాసినవి. వాటిలో శివారెడ్డి, గంటేడ, అరుణ్ సాగర్, అక్బర్ వంటి వారిపై ఆరాధనతో వ్రాసుకొన్నవి కొన్ని, వృత్తిరీత్యా ఉపాద్యాయుడు కావటం వల్ల విజయ, జీవన్, కుమారి వంటి ప్రతిభకలిగిన విద్యార్ధులపై, ఇంకా డ్రాయింగ్ టీచర్ దుర్గ, వీరశంకర్ వంటి సహాద్యాయులపై వ్రాసినవి మరికొన్ని ఉన్నాయి. ఇవికాక బాక్సైట్ తవ్వకాలు, ముస్లిమ్ రచయితపై దాడి, కల్బుర్గి, సొనిసోరి, అయిలాన్ పిలగాడు, వేట నిషేదం వంటి వివిధ సందర్భాలకు రాసినవి ఉన్నాయి.[2]
పురస్కారాలు
[మార్చు]- 2018 - కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారం[3]
అభిప్రాయాలు
[మార్చు]- తను చెప్పదలచుకున్న దానిపట్ల తనగాఢమైన నమ్మకాన్నినిక్కచ్చితనాన్నినిబ్బరాన్నిఎక్కడా సడలకుండా చెప్పడం అది ఒక కొత్త అభివ్యక్తిలోఆవిష్కరించడం ఈ కవితాసంకలనంలో బాలసుధార్ మౌళి సాధించారు. తన నిరంతర అధ్యయనం సమాజం పట్ల వున్నతన ప్రేమ, పసి పాపలాంటి తన మనసులోంచి వచ్చిన ప్రతి పదంలోను చిత్రించారు. - కెక్యూబ్ వర్మ[4]
- వ్యక్తీకరణలో కొత్తదనం, భావచిత్రాల్లో వైవిధ్యం వస్తువును కవిత్వం చేయడంలో ఆర్ద్రతని కనబరచడం బాలసుధాకర్ మౌళి కవిత్వ ప్రత్యేకతలు. ఇటీవల విడుదలయిన 'ఆకు కదలని చోట' పుస్తకంలో ఈరకమైన వైశిష్ట్యం స్పష్టంగా చూస్తాం. - కిరణ్‌కుమార్[5]
మూలాలు
[మార్చు]- ↑ లలితా బాల త్రిపుర సుందరి. "ఆకు కదలని చోట (కవిత్వం) పుస్తక సమీక్ష". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 23 June 2018.
- ↑ బొల్లోజు బాబా. ""ఆకు కదలని చోట" - కదలాడే కవిత్వపు జాడ". సాహితీయానం. Retrieved 23 June 2018.
- ↑ "2018 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2018-06-22. Retrieved 2018-06-23.
- ↑ కెక్యూబ్ వర్మ. "ఆకు కదలని చోట వర్షించిన కవిత్వం". విరసం. Archived from the original on 20 ఏప్రిల్ 2017. Retrieved 23 June 2018.
- ↑ కిరణ్‌కుమార్ (19 November 2016). "పాట వారి అంతరంగం ఊట". నవతెలంగాణ. Retrieved 23 June 2018.[permanent dead link]