Jump to content

ఆరికెపూడి గాంధీ

వికీపీడియా నుండి
ఆరికెపూడి గాంధీ
ఆరికెపూడి గాంధీ


పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి

ఆరికెపూడి గాంధీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1] [2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అరికెపూడి గాంధీ 1961 జూన్ 12 న ఏ. చిత్తరంజన్ దాస్, అనసూయ దంపతులకు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, నందివాడ మండలం, పోలుకొండ గ్రామంలో జన్మించాడు. రుద్రపాక లోని పీవీసీ జిల్లా పరిషత్ పాఠశాలలో 1976లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.[3]

రాజకీయ విశేషాలు

[మార్చు]

అరికెపూడి గాంధీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టిడిపి పార్టీలో ఉన్నాడు. ఆయన శేరిలింగంపల్లి టీడీపీలో క్రియాశీలకంగా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కొమరగోని శంకర్ గౌడ్ పై 76,257 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

ఆయన 2016, మార్చి 11న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5] 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ పై 44,295 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]

కుటుంబం

[మార్చు]

గాంధీకి శ్యామలదేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (పృథ్వీ, నందిత, ప్రణీత) ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. Eenadu (10 September 2024). "ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీ". Archived from the original on 10 September 2024. Retrieved 10 September 2024.
  3. admin (2019-01-10). "Serilingampally MLA Arekapudi Gandhi". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. Sakshi (9 March 2016). "11న టీఆర్‌ఎస్‌లోకి గాంధీ, గోపీనాథ్!!". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  6. "Arekapudi Gandhi(TRS):Constituency- SERILINGAMPALLY(RANGA REDDY) - Affidavit Information of Candidate".