ఇషాన్ కిషన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బోధ్ గయా , బీహార్, భారతదేశం | 1998 జూలై 18|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 235) | 2021 18 జులై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 10 డిసెంబర్ - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 84) | 2021 14 మార్చ్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 16 మార్చ్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2014 – ప్రస్తుతం | ఝార్ఖండ్ క్రికెట్ టీం | |||||||||||||||||||||||||||||||||||
2016–2017 | గుజరాత్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||
2018 – ప్రస్తుతం | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 18 జులై 2021 |
ఇషాన్ కిషన్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత జట్టు తరపున 18 జూలై 2021న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్ డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[1] ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2021లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
జీవిత చరిత్ర
[మార్చు]ఇషాన్ కిషన్ 1998 జూలై 18లో బీహార్ రాష్ట్రం బోధ గయాలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రణవ్ కుమార్ పాండే స్థిరాస్తి వ్యాపారుడు (బిల్డర్), సోదరుడు రాజ్ కిషన్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభానికి సహకరించాడు. క్రికెట్ సభ్యుల రెజిస్ట్రేషన్స్ వ్యవహారాల్లో బీహార్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ మధ్య గొడవల కారణంగా తన మిత్రుడి సలహాతో ఇషాన్ కిషన్ ఝార్ఖండ్ రాష్ట్రం తరపున క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కావడం వల్ల భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటే తనకు ఇష్టం అని తెలిపాడు.
వన్డే ఇంటర్నేషనల్ కెరీర్
[మార్చు]ఇషాన్ కిషన్ 2021లో శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన సిరీస్ లో 18 జూలై 2021న తొలి వన్డేలో ఆడి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇషాన్ కిషన్ తన తొలి మ్యాచ్ లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59 పరుగులు చేశాడు. ఆయన 33 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. తన మూడవ మ్యాచ్ లో డబుల్ సెంచరీ 121 బంతుల్లో సాధించాడు. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఒకే ఏడాదిలో వన్డేతోపాటు టీ20 లో అరగేంట్ర చేసి హాఫ్ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Ishan Kishan". ESPN Cricinfo. Retrieved అక్టోబరు 11 2015.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ Andrajyothy (జూలై 19 2021). "అన్నంత పనీ చేసిన ఇషాన్ కిషన్". andhrajyothy. Archived from the original on 20 జూలై 2021. Retrieved జూలై 20 2021.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ Namasthe Telangana (జూలై 19 2021). "ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొడతా చూడండి.. టీమ్ మేట్స్‌కు చెప్పి మరీ బాదిన ఇషాన్". Archived from the original on 20 జూలై 2021. Retrieved జూలై 20 2021.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ Sakshi (జూలై 19 2021). "భారత్, శ్రీలంక తొలి వన్డే: ధావన్ ధమాకా.. ఒక్క వన్డే 10 రికార్డులు". Archived from the original on 20 జూలై 2021. Retrieved జూలై 20 2021.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help)