కణ్ణగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నై మెరీనా బీచ్‌లో కణ్ణగి శిల్పం

కణ్ణగి (Tamil: கண்ணகி) దక్షిణ భారత కావ్యం అయిన శిలప్పదికారం లోని ముఖ్య పాత్ర. మధురై రాజు పొరబాటుగా తన భర్త కోవలన్ పై మరణ దండనని విధించటంతో ఆ పట్టణాన్ని దౌర్భాగ్యం ఆవహించే విధంగా శపిస్తుంది.

కావేరీ పట్టణపు ధనిక వ్యాపారి కుమారుడు కోవలన్ కి కణ్ణగి అనే అందమైన యువతితో వివాహం అయినది. కావేరీపట్టణంలో ఆనందంగా కలిసి జీవించేవారు. మాధవి అనే నర్తకితో ప్రేమలో పడ్డ కోవలన్ కణ్ణగిని మరచిపోయి, మాధవికే తన ఆస్తిని ధారాదత్తం చేస్తాడు. చేతిలో కానీ లేని కోవలన్, తన తప్పిదాన్ని తెలుసుకొని కణ్ణగి వద్దకి తిరిగి వస్తాడు. ముత్యాలు పొసగబడిన తన కాలి గజ్జలను తీసుకొని ఆ జంట మధురైలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బయలుదేరుతుంది.

పాండ్య రాజు నెడుంజ్ చెలియన్ 1 మధురైని పరిపాలించేవాడు. కణ్ణగి గజ్జలని అమ్మి నూతన జీవితాలని ప్రారంభించాలని ఆ జంట అనుకొంటారు. కానీ అదే సమయానికి రాణి గజ్జల్లో ఒకటి దొంగిలించబడి ఉంటుంది. కణ్ణగి గజ్జల వలె ఉన్న రాణి గజ్జలు రత్నాలతో పొసగబడి ఉంటాయి. కోవలన్ రాణి గజ్జలు దొంగిలించాడని సైన్యం విచారణ జరపకుండానే అతనిని వధిస్తారు. విషయం తెలిసిన కణ్ణగి కోపోద్రిక్తురాలై తన పతి నిర్దోషి అని నిరూపించటానికి రాజు వద్దకి వెళుతుంది.

కణ్ణగి సభలోకి వచ్చి రాజుకి రాణి గజ్జలకి తన గజ్జలకి ఉన్న తేడాని వివరిస్తుంది. తాము చేసిన పొరబాటుకి సిగ్గుపడి రాజదంపతులు ఇరువురూ ప్రాణత్యాగం చేస్తారు. వేదనతో కణ్ణగి తన వక్షోజాలలో ఒకదానిని శరీరం నుండి వేరు చేసి దానిని నగరం పైకి విసిరి నగరం మొత్తం తగులబడాలని శపిస్తుంది. పుణ్యవతి అయిన ఆ మహాసాధ్వి మాటలు నిజమైతాయి. దేవతల కోరికపై తన శాపాన్ని విరమించి కణ్ణగి మోక్షం పొందుతుంది.

విశేషాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కణ్ణగి&oldid=2010057" నుండి వెలికితీశారు