Jump to content

పత్ని (సినిమా)

వికీపీడియా నుండి
పత్ని
(1942 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం
నిర్మాణం గూడవల్లి రామబ్రహ్మం
కథ తాపీ ధర్మారావు
సంగీతం కొప్పరపు సుబ్బారావు
గీతరచన తాపీ ధర్మారావు
ఛాయాగ్రహణం సుధీష్ ఘాతక్
నిర్మాణ సంస్థ సారధీ పిక్చర్స్
నిడివి 194 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పత్ని సినిమా తమిళ గాథ అయిన శిలప్పదికారం ఆధారం చేసుకొని సారథీ పతాకం క్రింద తీసిన చారిత్రక సినిమా. పూంపుహార్లో జరిగిన కోవలన్ - కణ్ణగి కథను గూడవల్లి రామబ్రహ్మం అపూర్వమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఒక అపురూప చిత్రం అని విమర్శకులు కొనియాడారు. కళా దర్శకుడు వాలి చిత్రకళా నైపుణ్యం దానిని వన్నె తెచ్చింది.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

రాజకొలువులో పనిచేసే కోవలన్ రాజనర్తకి ప్రేమలో పడతాడు. అతని మీద రాజుగారి ధనాగారం నుంచి ఒక హారం దొంగిలించినట్లు అభియోగం పడుతుంది. అయితే అతని భార్య కన్నగి హారం తనదేనని ఋజువు చేస్తుంది. ఇంతలోపలే అతనికి మరణశిక్ష అమలవుతుంది. నిర్దోషి అయిన తన భర్తను తనకివ్వమని రాజును నిలదీస్తుంది కన్నగి. ఆగ్రహించిన కన్నగి పాతివ్రత్య మహిమతో మధుర పట్టణం సర్వనాశనమవుతుంది.

మూలాలు

[మార్చు]
  • శ్రీ గూడవల్లి రామబ్రహ్మం, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, శ్రీ గాయత్రి ప్రింటర్స్, తెనాలి, 2004.
  • నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.

బయటి లింకులు

[మార్చు]