కప్ప
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కప్ప | |
---|---|
White's Tree Frog (Litoria caerulea) | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | అనూర Merrem, 1820
|
Suborders | |
ప్రపంచంలో కప్పల విస్తరణ (నలుపు రంగు) |
కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో "తోక-లేకుండా", an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.
కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో "తోక-లేకుండా", an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.
కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు, తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో గుడ్లు పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ ఆర్థ్రోపోడా, అనెలిడా, మొలస్కా జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.
కప్పలు ప్రపంచమంతటా ముఖ్యంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలో ఎక్కువగా విస్తరించాయి. అయితే ఎక్కువ జాతులు అరణ్యాలలో కనిపిస్తాయి. కప్పలలో సుమారు 5,000 జాతులు గుర్తించారు. సకశేరుకాలు (vertebrate) అన్నింటిలోను విస్తృతమైన జీవన విధానం కలిగివుండే జీవులు ఇవి. వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి.
సామాన్య లక్షణాలు
[మార్చు]- ప్రౌఢదశలో తోక లోపించిన విజయవంతమైన ప్రత్యేక ఉభయచరాలు.
- పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. అంగుళ్యాంతజాలం గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
- ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
- కర్ణభేరి, కనురెప్పలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
- తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
- బాహ్య ఫలదీకరణ.
వర్గీకరణ
[మార్చు]- రానా - సాధారణ కప్పలు
- బుఫో - గోదురు కప్పలు
- హైలా - చెట్లమీద కప్పలు
- రాకోఫోరస్ - ఎగిరే కప్పలు
- ఎలైటిస్ - మంత్రసాని కప్ప
- డార్ట్ పాయిజన్ కప్ప-విషపు కప్ప