కలవారి కుటుంబం
కలవారి కుటుంబం (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.వి. ప్రభాకర రావు |
తారాగణం | జి. రామకృష్ణ, వాణిశ్రీ |
నిర్మాణ సంస్థ | గజేంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కలవారి కుటుంబం 1972లో విడుదలైన తెలుగు సినిమా. గజేంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై జి.వి.ప్రభాకరరావు, దేవర్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకు జి.వి.ప్రభాకరరావు దర్శకత్వం వహించాడు. రామకృష్ణ, వాణిశ్రీ, చంద్రమోహన్ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జి. రామకృష్ణ
- చంద్రమోహన్
- హరనాథ్
- రేలంగి వెంకటరామయ్య
- గుమ్మడి వెంకటేశ్వర రావు
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- నాగేష్ బాబు
- త్యాగరాజు
- భీమరాజు
- జ్యోతిలక్ష్మి
- రాజశ్రీ
- సుమ
- విజయశ్రీ
- విజయారాణి
- నిర్మల
- రమాప్రభ
- శ్యామల
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: జి.వి. ప్రభాకర రావు
- స్టూడియో: గజేంద్ర ఆర్ట్ పిక్చర్స్
- నిర్మాత: జి.వి. ప్రభాకర్ రావు, దేవర్‌రాజ్;
- ఛాయాగ్రాహకుడు: పాచు;
- కూర్పు: ఆర్.సురేంద్రనాథ్ రెడ్డి;
- స్వరకర్త: సత్యం చెళ్లపిళ్ల;
- గీత రచయిత: దాశరథి, ఆరుద్ర, కోసరాజు రాఘవయ్య చౌదరి, విజయ రత్నం గోన
- విడుదల తేదీ: 1972 సెప్టెంబర్ 9
- కథ: జి.వి. ప్రభాకర్;
- చిత్రానువాదం: జి.వి. ప్రభాకర్;
- సంభాషణ: మోదుకురి జాన్సన్, ఎస్.వి. రామరావు
- గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, రమోలా, ఎల్.ఆర్. ఈశ్వరి, వి.రామకృష్ణ దాస్
- ఆర్ట్ డైరెక్టర్: వి.సూరన్న;
- డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్, పసుమర్తి కృష్ణ మూర్తి
పాటల జాబితా
[మార్చు]1.సొగ్గాడా ఇటు చూడు రవ్వంటి కన్నెపిల్లుంది కన్ను, రచన: విజయరత్నం గోన, గానం.ఎల్. ఆర్ .ఈశ్వరి
2.చక్కనోడు భలే టక్కరోడు అహ , రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి
3.చిలిపి చూపులదాన చిక్కావే జాణ, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, రమోల
4.మాధవా రావేలా యమునా తీరంలో నీకై , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.విస్సంరాజు రామకృష్ణ, శిష్ట్లా జానకి
5.రా గుసగుస లాడుకో నా మిసమిస , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి.
మూలాలు
[మార్చు]- ↑ "Kalavari Kutumbam (1972)". Indiancine.ma. Retrieved 2020-08-23.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.