Jump to content

కాకతీయుల వంశవృక్షము

వికీపీడియా నుండి
కాకతీయ కళాతోరణం

తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు. వీరి కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. కాకతీయ సామ్రాజ్యము 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో పతనమయ్యింది.

వంశావళి

1. కాకతి వెన్నయ (క్రీ. శ. 750 - 768)

2. మొదటి గుండయ (క్రీ. శ. 769 - 824)

3. రెండవ గుండయ (క్రీ. శ. 825 - 870)

4. మూడవ గుండయ (క్రీ. శ. 870 - 895)

5. ఎఱ్ఱయ (క్రీ. శ. 896 - 925)

6. మొదటి బేతరాజు (క్రీ. శ. 946 - 955)

7. నాల్గవ గుండయ (క్రీ. శ. 956 - 995)

8. గరుడ బేతరాజు (క్రీ. శ. 996 - 1051)

9. మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052 - 1076)

10. రెండవ బేతరాజు (క్రీ.శ. 1076 - 1108)

11. దుర్గరాజు (క్రీ. శ. 1108 - 1195)

12. రెండవ ప్రోలరాజు (క్రీ. శ. 1116 -1157)

13. రుద్రదేవుడు (క్రీ.శ. 1158 - 1196)

14. మహాదేవుడు (క్రీ.శ. 1196 - 1199)

15. గణపతిదేవుడు (క్రీ.శ. 1199 - 1269)

16. రుద్రమదేవి (క్రీ.శ. 1269 - 1295)

17. ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1295 - 1323)