Jump to content

కాళ్ళకూరి నారాయణరావు

వికీపీడియా నుండి
కాళ్ళకూరి నారాయణరావు
కాళ్ళకూరి నారాయణరావు
జననంకాళ్ళకూరి నారాయణరావు
ఏప్రిల్ 28, 1871
మత్స్యపురి, వీరవాసరము మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
మరణంజూన్ 27, 1927
ఇతర పేర్లు‘మహాకవి’
వృత్తిప్రథమాంధ్ర ప్రకరణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు
ప్రసిద్ధినాటకకర్త, సంఘ సంస్కర్త.
తండ్రిబంగారురాజు
తల్లిఅన్నపూర్ణమ్మ

కాళ్ళకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 - జూన్ 27, 1927) నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రకరణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు.[1]

జననం

[మార్చు]

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరము మండలం, మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28 న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేళ్ళూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.

రచనలు

[మార్చు]
  • కాళ్ళకూరి నారాయణరావు 1919 లో రాసిన " పద్మవ్యూహం" నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు.

వరవిక్రయం

[మార్చు]

వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.[2]

చింతామణి

[మార్చు]

చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది. వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం. ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయంవంతంగా ప్రదర్శితమవుతోంది.

మధుసేవ

[మార్చు]

మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.[3]

చిత్రాభ్యుదయం

[మార్చు]

ఇది రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ, చిత్రాంగికీ నడుమ జరిగిన కథ.[4]

ఇతర రచనలు

[మార్చు]

పద్మవ్యూహం (1919),[5] సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.

మరణం

[మార్చు]

ఈయన 1927, జూన్ 27న మరణించాడు.

శిష్యులు,అభిమానులు

[మార్చు]
  • గుమ్మడి గోపాలకృష్ణ
  • డాక్టర్ కొత్తె వెంకటాచారి గారు (నారాయణరావు గారి నాటకాల మీద పి హెచ్ డీ చేశారు)

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.386.
  2. నవతెలంగాణ (8 December 2015). "నాటకం-వామపక్ష భావజాలం". Retrieved 29 June 2018.
  3. నారాయణరావు, కాళ్ళకూరి. మధుసేవ. Retrieved 13 January 2015.
  4. నారాయణరావు, కాళ్ళకూరి. చిత్రాభ్యుదయము. Retrieved 2020-07-11.
  5. వెబ్ ఆర్కైవ్. "పద్మవ్యూహము (నాటకం)". www.archive.org. Retrieved 29 June 2018.

బయటి లింకులు

[మార్చు]