కుంజా సత్యవతి
కుంజా సత్యవతి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
నియోజకవర్గం | భద్రాచలం శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగస్టు 1, 1971 వరరామచంద్రపురం, భద్రాచలం మండలం, తెలంగాణ, భారతదేశం | ||
మరణం | 2023 అక్టోబరు 15 భద్రాచలం | (వయసు 52)||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కుంజా ధర్మారావు | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
కుంజా సత్యవతి (1971 ఆగస్టు 1 - 2023 అక్టోబరు 15) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరపున భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]సత్యవతి 1971, ఆగస్టు 1న శూలం కృష్ణ, సీతమ్మ దంపతులకు భద్రాచలం మండలం లోని వరరామచంద్రపురం లో జన్మించింది. 10వ తరగతి వరకు చదువుకుంది.
వివాహం - పిల్లలు
[మార్చు]1988, ఆగస్టు 8న కుంజా ధర్మారావుతో సత్యవతి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (సంతోష్ కుమార్, విశ్వశాంతి)
రాజకీయరంగ ప్రస్థానం
[మార్చు]సీపీఎం పార్టీ ద్వారా ఆమె రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. 1991లో భద్రాచలం ఎంపిపిగా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా భారత జాతీయ కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికయింది. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది. అనంతరం, భారతీయ జనతా పార్టీలో చేరింది.
మరణం
[మార్చు]కుంజా సత్యవతి (52) గుండెపోటు కారణంగా 2023 అక్టోబరు 15న భద్రాచలంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచింది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి ఎడ్యువేషన్. "ఆరంభంలోనే అంతరాయం". www.sakshieducation.com. Retrieved 15 May 2017.
- ↑ "తెలంగాణ బీజేపీలో విషాదం.. కుంజా సత్యవతి హఠాన్మరణం | Telangana BJP Leader Kunja Satyavathi Passed Away - Sakshi". web.archive.org. 2023-10-16. Archived from the original on 2023-10-16. Retrieved 2023-10-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Andhrajyothy (16 October 2023). "మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.