Jump to content

కూన శ్రీశైలం గౌడ్

వికీపీడియా నుండి
కూన శ్రీశైలం గౌడ్
కూన శ్రీశైలం గౌడ్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1966-06-17) 1966 జూన్ 17 (వయసు 58)
గాజులరామారం గ్రామం, కుత్బుల్లాపూర్, మేడ్చల్ జిల్లా.
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
వెబ్‌సైటు Official website

కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం

[మార్చు]

కూన శ్రీశైలం గౌడ్ 1966, జూన్ 7న గాజులరామారం గ్రామం, కుత్బుల్లాపూర్‌ మండలం, మేడ్చల్ జిల్లాలో జన్మించాడు.

రాజకీయ నేపథ్యం

[మార్చు]

కూన శ్రీశైలం గౌడ్ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2005 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించాడు, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014,2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు.[1] కూన శ్రీశైలం గౌడ్ 2021, ఫిబ్రవరి 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు..పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశాడు.[2] బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరాడు.[3][4]

కూన శ్రీశైలం గౌడ్  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2024 ఏప్రిల్ 05న ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 February 2019). "హస్తానికి నవ సారథులు". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  2. 10TV, ome » Telangana » బ్రేకింగ్ న్యూస్ (21 February 2021). "కాంగ్రెస్ కు కూన శ్రీశైలం గౌడ్ గుడ్ బై". 10TV (in telugu). Archived from the original on 6 April 2021. Retrieved 6 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. మన తెలంగాణ, Home తాజా వార్తలు కాంగ్రెస్‌కు కూన రాజీనామా (21 February 2021). "కాంగ్రెస్‌కు కూన రాజీనామా". Archived from the original on 6 April 2021. Retrieved 6 April 2021.
  4. Etvbharat (25 February 2021). "కాంగ్రెస్ పోరాటం చేయలేకపోతోంది: శ్రీశైలం గౌడ్". Archived from the original on 6 April 2021. Retrieved 6 April 2021.
  5. TV9 Telugu (5 April 2024). "బీజేపీకి కూన శ్రీశైలం గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక". Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Mana Telangana (5 April 2024). "కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంఎల్ఎ కూన శ్రీశైలం గౌడ్". Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.