అక్షాంశ రేఖాంశాలు: 40°10′41″N 44°30′47″E / 40.17806°N 44.51306°E / 40.17806; 44.51306

కెంట్రాన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కెంట్రాన్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. రాజధానిలోని ఆర్ధిక నగరం ఇక్కడే ఉన్నది. 2011 గణాంకాల ప్రకారం జిల్లాలో 125,453 మంది నివసిస్తున్నారు.

కెంట్రాన్
Կենտրոն
కెంట్రాన్ జిల్లా
కెంట్రాన్ జిల్లా
ఎరుపు రంగులో ఉన్న జిల్లా
ఎరుపు రంగులో ఉన్న జిల్లా
కెంట్రాన్ is located in Armenia
కెంట్రాన్
కెంట్రాన్
Coordinates: 40°10′41″N 44°30′47″E / 40.17806°N 44.51306°E / 40.17806; 44.51306
దేశంఆర్మేనియా
మార్జ్ (రాజ్యం)యెరెవన్
Government
 • జిల్లా మేయర్అరా సదోయన్
విస్తీర్ణం
 • Total14.2 కి.మీ2 (5.5 చ. మై)
Elevation
995 మీ (3,264 అ.)
జనాభా
 (2011 జనాభా)
 • Total1,25,453
 • జనసాంద్రత8,800/కి.మీ2 (23,000/చ. మై.)
Time zoneUTC+4 (AMT)

కెంట్రాన్ కు సరిహద్దులుగా పశ్చిమాన్  అజప్న్యాక్,మల్టియా-సెబష్టియా, దక్షిణాన్ షెంగావిత్, నార్ నార్క్, తూర్పు నుండి, అరబ్కిర్,  కనాకర్-జేత్యున్ జిల్లాలు ఉన్నాయి. హ్రజ్డాన్ నది జిల్లాలోని పశ్చిమ భాగం నుండి ప్రవహిస్తుంది.[1]

వ్యుత్పత్తి

[మార్చు]

ఆర్మేనియన్ భాషలో కెంట్రాన్ అంటే మధ్యభాగం అని అర్ధము. ఈ పదం పురాతన గ్రీకు భాష నుండి పుట్టినది.

అవలోకనం

[మార్చు]

ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది, అవి: కాండ్, నోరాగ్యుహ్, పాక్ర్ కెంట్రాన్, నార్ కిలికియా, కాంజెర్న్, ఆయ్గెస్తాన్.

యెరెవాన్ లోని పురాతనమైన ప్రాంతాలలో కాండ్, నోరాగ్యుహ్ ఎంతో ముఖ్యమైనవి.

పార్కులు:

  • ఇంగ్లీషు పార్కు.
  • పిల్లల పార్కు
  • అబోవ్యాన్ పిల్లల పార్కు, రైల్వే
  • త్సిసర్నాకబెర్డ్ పార్కు
  • సర్కులర్ పార్కు
  • ప్రేమికుల పార్కు
  • మార్టిరోస్ సర్యాన్ పార్కు
  • కోమిటాస్ పార్కు
  • షహుమ్యెన్ పార్కు
  • మిస్సాక్ మనౌచియానా పార్కు

చరిత్ర

[మార్చు]
కెంట్రాన్ జిల్లా యొక్క పరిపాలనా భవనం
సర్కులర్ పార్కు దగ్గర పొప్లవోక్ పార్క్

1920-1921 మధ్య ఆర్మేనియా సోవియట్ పాలన కింద చేరిన తరువాత, సోవియట్ యూనియన్ ఒక సాధారణ ప్రణాళికా ప్రకారం అభివృద్ధి చేయబడిన నగరాలలో యెరెవాన్ మొదటిది. అలెగ్జాండర్ తమానియన్ తయారు చేసిన "యెరెవాన్ సాధారణ అభివృద్ధి ప్రణాళిక"ను 1924లో ఆమోదించారు. నగరాన్ని మొదట 150,000 జనాభా కోసం తయారు చేశారు. నగరం త్వరగా ఒక ఆధునిక పారిశ్రామిక మహానగరంగా ఒక మిలియన్ పైగా ప్రజలతో రూపాంతరం చెందింది. ఎన్నో కొత్త విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థలు స్థాపించబడ్డాయి.

తమానియన్ జాతీయ సంప్రదాయాలను సమకాలీన పట్టణ విధానంతో విలీనం చేసి నిర్మాణం చేపట్టారు. తను సమర్పించిన డిజైను ఒక రేడియల్-వృత్తాకార అమరిక  కలగలిసిన ఉన్న నగరంలోని వీధి ప్రణాళికలను విలీనం చేసుకుంది. ఫలితంగా, నగరంలోని అనేక చారిత్రాత్మక భవనాలను (ఆధునిక-రోజు కెంట్రాన్ జిల్లాలో ఉన్నవి) నేలమట్టం చేశారు. వాటిలో చర్చిలు, మసీదులు, సఫావిద్ కోట, స్నానాఘాట్లు, బజారులు, కరవాంసెరియాస్ లు ఉన్నవి.

కేవలం కొన్ని సంవత్సరాలలోనే, కెంట్రాన్ నగరంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మారింది. ఇది ఇతర జిల్లాలతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంది. ఎన్నో విద్యా, సాంస్కృతిక, శాస్త్రీయ సంస్థలు జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాలోని పరిపాలనా భవనాలకు కేంద్రంగా మారింది. వాటిలో రాష్ట్రపతి భవనం, ఆర్మేనియా జాతీయ శాసనసభ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఆర్మేనియా, జాతీయ భద్రతా సేవ, చాలా మంత్రిత్వ భవనాలు ఉన్నాయి.

జనాభా వివరాలు

[మార్చు]

మతపరమైన భవనాలు, చారిత్రక ప్రదేశాలు:

జోర్వార్ సర్ప్ అస్త్వాత్సాసిన్ చర్చి
  • జోర్వార్ సర్ప్ అస్త్వాత్సాసిన్ చర్చి
  • సెయింట్ సార్కిస్ కేథడ్రల్
  • కటోగికే చర్చి
  • సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చి
  • సెయింట్ గ్రెయోగరీ కేథడ్రల్
  • సర్ప్ అన్నా చర్చి
  • బ్లూ మసీదు
  • కాన్ ప్రాంతం
  • యెరెవాన్ ఎరుపు వంతెన 17వ శతాబ్దంలో నిర్మించినది

సంస్కృతి

[మార్చు]
ది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్మేనియా
కెఫేత్సిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, యెరెవాన్ కోట వద్ద ఉన్నది
  • నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఆర్మేనియా
  • నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా
  • యెరెవాన్ ఒపేరా థియేటర్
  • సుందుక్యాన్ రాష్ట్ర విద్యా థియేటర్
  • పరోన్యాన్ సంగీత కామెడీ థియేటర్
  • స్టానిస్లవ్సి రష్యన్ థియేటర్
  • హోవ్హాన్నిస్ తుమన్యాన్ తోలుబొమ్మ థియేటర్
  • కోమిటాస్ చాంబర్ మ్యూజిక్ హాల్
  • ఆర్నో బబజానిన్ కచేరీ హాల్
  • మ్యూజియం-ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంషియంట్ మాన్యుస్క్రిప్ట్స్
  • ఆర్మేనియా చరిత్ర మ్యూజియం
  • కఫేస్జియాన్ మ్యూజియం అఫ్ ఆర్ట్
  • యెరెవాన్ యొక్క చరిత్ర మ్యూజియం
  • ది ఆర్మేనియన్ జెనోసైడ్-ఇన్స్టిట్యూట్
  • Sergei పరజనోవ్ మ్యూజియం
  • హౌస్-మ్యూజియం ఆవ్ అరాం కచతూరియన్
  • కుంకో ఆపెర్ చిల్డ్రన్స్ లైబ్రరీ
  • సెంటర్ ఆఫ్ కాంటెంపరరీ ఎక్స్పరిమెంటల్ ఆర్ట్

వినోద, వినోదం:

మాస్కో సినిమా
  • మాస్కో సినిమా
  • నైరి సినిమా
  • యెరెవాన్ సర్కస్
  • యెరెవాన్ కోన
  • తషిర్ మాల్
  • యెరెవాన్ వెర్నిసాజే ఆర్ట్ ఎగ్జిబిషన్

రవాణా

[మార్చు]
రిపబ్లిక్ స్క్వేర్ మెట్రో స్టేషను వద్ద ఫౌంటైన్లు
అబోవ్యాన్ వీధి
చార్ల్స్ అజ్నవోర్ స్క్వేర్
ప్లేస్ డి ఫ్రాన్స్, జూల్స్ బస్టిన్-లెపేజ్ విగ్రహం

జిల్లాలో ఎన్నో బస్సులు, ట్రాలీబస్సులు తిరుగుతున్నాయి

  • యెరెవాన్ భూగర్భ మెట్రో పరిదిలో నాలుగు స్టేషన్లు జిల్లాలో ఉన్నవి:
    • మార్షల్ బఘ్రామ్యన్ స్టేషన్
    • యెరిటాసర్దక్ స్టేషన్
    • రిపబ్లిక్ స్క్వేర్ స్టేషన్
    • జనరల్ ఆంధ్రానిక్ స్టేషన్
  • అరామ్ వీధి
  • అభోవ్యన్ వీధి
  • మష్టొట్స్ అవెన్యూ
  • మైకేల్ నల్బాందియన్ వీధి
  • అమిర్యాన్ వీధి
  • టిగ్రాన్ మెట్స్ (గొప్ప టిగ్రానీస్) వీధి
  • సయత్ నోవా వీధి
  • తుమన్యాన్ వీధి
  • మార్షల్ భగ్రమ్యాన్ వీధి
  • చారెంట్స్ వీధి
  • పరోన్యాన్ వీధి
  • ప్రోష్యాన్ వీధి
  • ఇటలీ వీధి
  • వాజ్గెన్ సర్గ్స్యాన్ వీధి
  • అర్గిష్టి 1 వీధి
  • ఉత్తర అవెన్యూ
  • సలరంజ్ వీధి
  • రిపబ్లిక్ స్క్వేర్
  • ఫ్రీడం స్క్వేర్
  • చార్ల్స్ అజ్నవోర్ స్క్వేర్
  • అండీ సఖ్రావ్ స్క్వేర్
  • స్క్వేర్, రష్యా
  • ఫ్రాన్సు పాలెస్సు
  • ష్టెపాన్ షహుమ్యాన్ స్క్వేర్
  • అలెగ్సాండర్ మ్యాస్నిక్యాన్ స్క్వేర్

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

పారిశ్రామలు:

యెరెవాన్ బ్రాందీ కంపెనీ
  • యెరెవాన్ అరరట్ వైన్ ఫ్యాక్టరీ
  • యెరెవాన్ బ్రాందీ కంపెనీ
  • ఎలక్ట్రో హౌస్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీ

విద్య

[మార్చు]

విద్యా సంస్థలు:

ఆర్మేనియా రాష్ట్ర ఇంజినీరింగ్ యూనివర్శిటీ
  • ఆర్మేనియా రాష్ట్ర యూనివర్శిటీ
  • యెరెవాన్ రాష్ట్ర ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం
  • ఆర్మేనియా రాష్ట్ర సంగీత సంరక్షణాలయం
  • ఆర్మేనియనా రాష్ట్ర బోధనా విశ్వవిద్యాలయం
  • ఆర్మేనియా రాష్ట్ర మెడికల్ విశ్వవిద్యాలయం
  • ఆర్మేనియా రాష్ట్ర ఇంజినీరింగ్ యూనివర్శిటీ 
  • ఆర్మేనియా రాష్ట్ర లింగ్విష్టిక్ యూనివర్శిటీ
  • ఆర్మేనియా రాష్ట్ర ఎకనామి యూనివర్శిటీ
  • ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్

క్రీడ

[మార్చు]
ది రిపబ్లికన్ స్టేడియం, యెరెవాన్
  • ఆర్మేనియా క్రీడా స్టేడియం
  • రిపబ్లికన్ స్టేడియం
  • టిగ్రాన్ పిట్రోసియన్ చదరంగం హౌస్
  • హ్రజ్డాన్ స్టేడియం
  • కరెన్ డెమిర్చ్యాన్ కాంప్లెక్స్
  • ఆరెంజ్ టెన్నిస్ క్లబ్
  • మాస్టర్ క్లాస్ టెన్నిస్ క్లబ్
  • డినామో క్రీడలు అరేనా
  • కిలికియా క్రీడలు హాల్
  • ప్యునిక్ స్టేడియం
  • ప్యునిక్ ట్రైనింగ్ సెంటర్

గ్యాలరీ

[మార్చు]
కెంట్రాన్ జిల్లా యొక్క విస్తృత దృశ్యం

సూచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kentron District at Yerevan.am