కొమరం భీం ప్రాజెక్ట్
స్వరూపం
కొమరం భీం ప్రాజెక్ట్ | |
---|---|
అధికార నామం | కొమరం భీం ప్రాజెక్ట్ Sri Komaram Bheem Project |
ప్రదేశం | అడ గ్రామం, ఆసిఫాబాద్ మండలం, ఆదిలాబాద్ జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 19°26′0″N 79°13′26″E / 19.43333°N 79.22389°E |
ప్రారంభ తేదీ | నవంబర్ 19, 2011[1] |
నిర్మాణ వ్యయం | 1.85 లక్షల కోట్లు |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | పెద్దవాగు నది |
Height | 18 మీటర్లు (59 అడుగులు) |
పొడవు | 1,012 మీటర్లు (3,320 అడుగులు) |
జలాశయం | |
సృష్టించేది | కొమరం భీం జలాశయం |
కొమరం భీం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అడ గ్రామం వద్ద నిర్మించిన ప్రాజెక్ట్.[2][3] హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడైన కొమురం భీమ్ (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది.
ప్రారంభం
[మార్చు]2011, నవంబర్ 19న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు.[1]
ప్రాజెక్టు వివరాలు
[మార్చు]ఆదిలాబాదులోని అసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్ మండలాలలోని 45,000 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది.
నీటిమట్టం
[మార్చు]ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243మీటర్లు కాగా, 2021, జూలై 15 న ప్రాజెక్టులోకి 241.8 మీటర్ల మేర నీరు వచ్చిచేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 The Hindu (19 November 2011). "Komaram Bheem project launch today". Archived from the original on 13 July 2018. Retrieved 13 July 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2018-07-27.
- ↑ నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (9 July 2018). "కుమ్రంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు". Archived from the original on 13 July 2018. Retrieved 13 July 2018.