కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం
కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం | |
---|---|
IUCN category IV (habitat/species management area) | |
Location | ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Nearest city | ఏలూరు |
Coordinates | 16°37′N 81°12′E / 16.617°N 81.200°E[1] |
Area | 673 కి.మీ2 (166,000 ఎకరం) |
Established | నవంబరు 1999 |
Governing body | ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ |
చెల్లని డెజిగ్నేషను | |
గుర్తించిన తేదీ | 19 ఆగస్టు 2002[1] |
కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సుకు సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం. 673 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం 1972 వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం 1999, నవంబరు నెలలో స్థాపించబడింది. 2002లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కోసం రామ్‌సర్ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేయబడింది.[1][2]
భౌగోళికం
[మార్చు]కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల కృష్ణానది, గోదావరి డెల్టాల మధ్యన ఏలూరు నగరం నుండి 10 నుండి 25 కి.మీ.ల వరకు విస్తరించి ఉంది.[3]
వృక్షజాలం
[మార్చు]ఈ ప్రాంతంలో ఫ్రాగ్మిట్స్ కర్కా ప్రధాన వృక్షజాలంగా ఉంది.[4] ఇది 10 అడుగుల ఎత్తు వరకు పెరిగి, కొన్ని జాతుల పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది.[5] దీనితోపాటు నిమ్ఫే నౌచాలి, నైఫోయిడ్స్ ఇండికం, ఒట్టెలియా అలిస్మోయిడ్స్, నెచమండ్రా ఆల్టర్నిఫోలియా, లిమ్నోఫిలా ఇండికా, వల్లిస్నేరియా స్పైరాలిస్, బ్లైక్సా ఆక్టాండ్రా, ఇపోమోయా ఆక్వాటికా, స్కిర్పస్ ఆర్టికులిటమ్స్, పాస్గామాటాస్ వంటి జల వృక్షాలు కూడా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Kolleru Lake". Ramsar Wetlands. Ramsar. Retrieved 12 July 2021.
- ↑ "Kolleru Bird Sanctuary". www.sanctuariesindia.com. Archived from the original on 12 మే 2016. Retrieved 12 July 2021.
- ↑ Ramsar convention, Wet land. "Kolleru Lake". www.rainwaterharvesting.org. Retrieved 12 July 2021.
- ↑ Wetlands of the World I: Inventory, Ecology and Management edited by Dennis F. Whigham, D. Dykyjová, S. Hejný (page-382)
- ↑ Kolleru Lake, Flora. "C.P.R. Environmental Education Centre". www.cpreec.org. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 12 July 2021.
బయటి లింకులు
[మార్చు]- కొల్లెరు వాటర్ లేక్ టూరిజం సైట్ Archived 2016-08-20 at the Wayback Machine
- కొల్లెరు కమిటీ Archived 2016-06-03 at the Wayback Machine
- కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఆకృతి