క్యారట్ దోశ
Jump to navigation
Jump to search
క్యారట్ దోశ దోశలో ఒక ప్రత్యేక రకమైన దోశ. ఇందులో పలు పోషకాలు లభ్యమౌతాయి. దీనిని ఉత్తర భారతదేశంలో విరివిగా చేస్తారు.[1]
కావలసిన పదార్థాలు
[మార్చు]- క్యారెట్ తురుము - 1 కప్పు
- బియ్యం - 1 కప్పు
- పచ్చిమిర్చి - 2
- దనియాలు - 1 టీ స్పూను
- ఉప్పు - రుచికి తగినంత
- పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు
- మజ్జిగ - కప్పు
- ఉల్లి తరుగు - అరకప్పు
- కొత్తిమీర తరుగు - పావుకప్పు
- నూనె - కాల్చడానికి సరిపడా
తయారుచేసే విధానం
[మార్చు]- ఒక రాత్రంతా బియ్యం నానబెట్టాలి.
- నీరు వడకట్టిన బియ్యంలో పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉల్లి, కొత్తిమీర తరుగు, దనియాలు, ఉప్పు, పచ్చికొబ్బరి వేసి (నీటికి బదులు) మజ్జిగ చిలకరిస్తూ చిక్కగా రుబ్బుకోవాలి.
- తర్వాత ఈ మిశ్రమాన్ని దోశల్లా పోసుకుని రెండువైపులా కాల్చుకోవాలి.
- ఇందులో రైతా ను కూరగా వాడుకోవచ్చు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Carrot Dosa". TeluguOne Recipes (in ఇంగ్లీష్). 2020-09-16. Retrieved 2020-09-16.