గాదెవారిపల్లి
Jump to navigation
Jump to search
గాదెవారిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | కారంపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ దోర్ణాల బ్రహ్మారెడ్డి |
పిన్ కోడ్ | 522614 |
ఎస్.టి.డి కోడ్ | 08649 |
గాదెవారిపల్లె, పల్నాడు జిల్లా కారంపూడి మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]- కారంపూడి నుండి దాచేపల్లికి వెళ్ళె దారిలో చినకొదమగుండ్ల గ్రామం తర్వాత వస్తుంది. సుమారు 4,000 జనాభా ఉంటుంది.
- ఈ గ్రామ శివార్లలో నాగులేరు ప్రవహించుచున్నది.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రం పరిధిలో పేటసన్నెగండ్ల, చింతపల్లె ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రి 1982కి పూర్వం పల్నాట ప్రధాన ఆసుపత్రి (మదర్ పి.హెచ్.సి) గా సేవలందించింది. అప్పట్లో 5 ఎకరాల సువిశాలమైన స్థలంలో, 6 పడకలతో, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, ప్రజలకు అందుబాటులో ఉండేటందుకు 9 క్వార్టర్లు, శస్త్ర చికిత్స గది, రక్తపరీక్షల కేంద్రాన్నీ నిర్మించారు. కాలాంతరంలో రూపురేఖలు కోల్పోయిన ఆసుపత్రిలో నూతనభవనం నిర్మించారు. ఆ తరువాత ఈ ఆసుపత్రి ప్రాభవం కోల్పోయింది. [4]
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దోర్ణాల బ్రహ్మారెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు. తరువాత ఇతను మొదటిసారి ఏర్పడిన కారంపూడి మండల సర్పంచిల సంఘానికి కార్యదర్శిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ రామాలయం.
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, మార్చి-18వ తేదీ నుండి 22వ తేదీ ఆదివారం వరకు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.