గుమ్మలూరి శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుమ్మలూరి శాస్త్రి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రవాసాంధ్రుడు. ఆయన విద్యాధికుడే కాక సినీ నిర్మాత, నటుడు కూడా.

జీవిత చరిత్ర

[మార్చు]

ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన గుమ్మలూరి శాస్త్రి తండ్రి గుమ్మలూరి సత్యనారాయణ. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎమ్.ఎస్.సి పూర్తి చేసిన గుమ్మలూరి శాస్త్రి కొంతకాలం లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1965లో ఆస్ట్రో ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయటానికి యు.ఎస్.ఎ వెళ్ళారు. అక్కడ కాలిఫోర్నియా యూనివర్శిటీ లో పి.హెచ్.డి కూడా పూర్తి చేశారు. ఆ తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన నాయస్ అండ్ వైబ్రేషన్ స్పెషలిస్ట్ గా వాషింగ్టన్ మెట్రోలో చేరారు.

ఇక ఆ తర్వాత తన స్నేహితుడు మీర్ అబ్దుల్లా కలిసి జంధ్యాల దర్శకత్వంలో పడమట సంధ్యారాగం(1986) చిత్రాన్ని నిర్మించారు.[1] టామ్, విజయశాంతి జంటగా చేసిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి నిర్మాతగానే కాకుండా గుమ్ములూరి శాస్త్రి విజయశాంతి తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.[2] తిరిగి చాలా కాలం తరువాత 2001లో అటు అమెరికా ఇటు ఇండియా అనే చిత్రానికి దర్శకత్వం వహించి నంది అవార్డ్ సాధించారు. ఆయనకు పడమట సంధ్యారాగం సినిమా సీక్వెల్ మరో సంధ్యారాగం ఆలోచన ఉన్నా కార్యరూపందాల్చలేదు.

మరణం

[మార్చు]

2008 నవంబరు 24న గుమ్మలూరి శాస్త్రి తుది శ్వాస వదిలారు. ఆయనకు భార్య కనకదుర్గ, ఓ కూతురు, ఇద్దరు మనవలు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "గుమ్మలూరి శాస్త్రి, మీర్ అబ్దుల్లా ప్రవాసాంధ్రుల మొదటి చిత్రం "పడమటి సంధ్యా రాగం"".
  2. "Gummaluri Sastri". IMDb. Retrieved 2022-07-03.