Jump to content

గురువారం

వికీపీడియా నుండి
గరు గ్రహం ప్రతిరూపం (జూపిటర్)

గురువారం (Thursday) అనేది వారంలో ఐదవ రోజు. ఇది బుధవారంనకు, శుక్రవారంనకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మీవారం, బేస్తవారం అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహం (బృహస్పతి) పేరు మీదుగా గురువారమైంది.హిందూ మతంలో గురువారం ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువుకు అంకితం చేసిన వారపు రోజు.పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు ఒకరు.గురువారం లేదా గురువార్‌ను సాధారణంగా బృహస్పతివార్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది విష్ణువు, బృహస్పతి (దేవతల గురువు) లకు అంకితం చేయబడింది.[1]

గురువారం ప్రాముఖ్యతలు

[మార్చు]
  • గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు.ఈరోజు షిరిడీ సాయిబాబా భక్తులకు ఎంతో పవిత్రమైంది.ఆయుస్సు ఆరోగ్యం కోరుకునేవారు నమ్మకంతో కొంతమంది భక్తులు ఈ రోజు దక్షిణా మూర్తికి లేదా సాయిబాబాకు పాలతో అభిషేకం చేయిస్తారు.[2]
  • కొన్ని ప్రాంతాలలోని ప్రజలు గురువారం హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు.కొంతమంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసం పాటిస్తారు.[1]
  • గురువారాలు ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా పరిగణించబడతాయి. ఈ రోజు దేవతలను ఆరాధించడం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.తన పాపాలను ఈ రోజు ఒకరికి సహాయపడటం ద్వారా నివారించవచ్చును. బలం, శౌర్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది. పిల్లలు లేని వారికి, మంచి విద్యకు శుభాలు కలుగుతాయి.[3]

శ్రీరాముడు జననం

[మార్చు]

హిందువులకు అంత్యత ముఖ్యమైన పండగలలో శ్రీరామనవమి ఒకటి.ఈ పండగను హిందువులు కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో ఈ పండగను జరుపుకుంటారు.ఈ పండగకు మూలకారకుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో, వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా గురువారం అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో జన్మించినాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://www.londonsrimurugan.org/pdf/EachDayoftheWeek.pdf
  2. "ఏ వారం ఏ పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది ?". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-07-22.
  3. "Significance of Thursday: Know About Brihaspati (Guru)". IndiaDivine.org (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-09-07. Retrieved 2020-07-22.
  4. https://telugu.boldsky.com/inspiration/glory-significance-sri-rama-navami-008076.html
  5. nellore (2019-04-10). "శ్రీరామనవమి ప్రాముఖ్యత". Nellore App (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-22.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గురువారం&oldid=3884319" నుండి వెలికితీశారు