గెరాల్డ్ బాండ్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కేప్ టౌన్, కేప్ కాలనీ | 1909 ఏప్రిల్ 5|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1965 ఆగస్టు 27 కేప్ టౌన్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | (వయసు 56)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1929/30–1938/39 | Western Province | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive |
గెరాల్డ్ ఎడ్వర్డ్ బాండ్ (1909, ఏప్రిల్ 5 - 1965, ఆగస్టు 27) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1938లో ఒక టెస్ట్ ఆడాడు.[1]
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి వాటం కలిగిన మిడిల్ లేదా అప్పర్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు. 1929-30 వరకు వెస్ట్రన్ ప్రావిన్స్ తరపున సక్రమంగా ఆడాడు. నాటల్‌పై వెస్ట్రన్ ప్రావిన్స్‌కు 170 పరుగులతో అత్యుత్తమ సీజన్ 1936-37లో తన ఏకైక ఫస్ట్-క్లాస్ సెంచరీ చేశాడు.[2] తరువాతి మ్యాచ్ లో, బోర్డర్‌పై వెస్ట్రన్ ప్రావిన్స్ బౌలింగ్‌ను ప్రారంభించి, తన మీడియం-పేస్‌తో 17 పరుగులకు నాలుగు వికెట్లు తీశాడు. తనన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇది.[3]
1938-39లో ఇంగ్లాండ్ జట్టుతో వెస్ట్రన్ ప్రావిన్స్ మ్యాచ్‌లో రెండు వికెట్లు (వాలీ హమ్మండ్‌తో సహా) తీసుకున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేశాడు.[4] ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు, ఆరవ బౌలర్ గా కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి వికెట్లేమి తీయకుండా 16 పరుగులు ఇచ్చాడు. తరువాత మళ్ళీ దక్షిణాఫ్రికాకు ఎంపిక కాలేదు. వాస్తవానికి తదుపరి ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ఆడలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "Gerald Bond". www.cricketarchive.com. Retrieved 2012-01-15.
- ↑ "Scorecard: Natal v Western Province". www.cricketarchive.com. 1937-03-06. Retrieved 2012-01-25.
- ↑ "Scorecard: Border v Western Province". www.cricketarchive.com. 1937-03-13. Retrieved 2012-01-25.
- ↑ "Scorecard: Western Province v MCC". www.cricketarchive.com. 1938-11-12. Retrieved 2012-01-25.