గోడకుర్చీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గోడకుర్చీ తెలుగువారు ప్రాచీన కాలంలో కనిపెట్టిన ఒక అద్భుత యోగాసనం. తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేసిన విద్యార్ధులకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వాడే ఒక దండనాపద్ధతే గోడకుర్చీ వేయించటం.

గోడకుర్చీ

చేసే విధానం

[మార్చు]

గోడకు ఆనుకొని ఉన్న ఒక కుర్చీని ఊహించండి. శరీరాన్ని ఆ కుర్చీ పోజులో ఇమిడ్చి, కొంతసేపు ఒణక కుండా, కదలకుండా ఉంచడాన్నే `గోడకుర్చీ వెయ్యడం (లేక చెయ్యడం) అంటారు. ఇది చేయడానికి గోడకు సుమారు అడుగు దూరంలో పాదాలు రెంటినీ సుమారు అడుగు వ్యత్యాసంలో ఉంచి నిటరుగా నుంచోండి. మోకాలునుంచి పాదాలవరకూ కాళ్ళను నిటారుగా ఉంచుతూ వంగి, మోకాటినుంచి పిరుదులవరకూ ఉండే శరీర మధ్య భాగాన్ని భూమికి సమానంతరంగా చేసి, శరీర పైభాగాన్ని (పిరుదులనుంచి తలవరకూ) నీటారుగా చేస్తే ఈ పైభాగం గోడకు ఆనుతుంది. అప్పుడు చేతులు బార్లా చాపి భూమికి సమానాంతరంగా పెడితే అవీ గోడకు ఆనుకొని ఉంటాయి. ఇప్పుడు మీరు గోడకుర్చీ పోజుకి వస్తారు. అలానే కదలకుండా, పడిపోకుండా, సుమారు 5 నిముషాలు (మీ ఓపికను బట్టి) ఉండండి.

చరిత్ర

[మార్చు]

తెలుగువాళ్ళు ప్రాచీనకాలంనుంచీ గోడకుర్చీ చేస్తున్నారు. కానీ, మిగతాప్రాంతం ప్రజలకు గోడకుర్చీ గురించి ఇంతవరకూ తెలియదు. ఇంగ్లీషువాళ్ళు, స్కూల్లో అసభ్యంగా ప్రవర్తించిన పిల్లల్ని బెంచిమీద నిలబడమని శిక్ష వేస్తారు. ఇంగ్లీషువాళ్ళహయాంలో ఇన్ని సంవత్సరాలు ఉండడంవల్ల మన పంతుళ్ళు కూడా ఈ పద్ధతినే ఇప్పుడు అవలంబిస్తున్నారు. కానీ దీనిముందు తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేసిన విద్యార్ధులకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వాళ్ళచేత గోడకుర్చీ వేయించేవారు.

ఈ వ్యాయామాలవల్ల ఫలితం ఏమిటీ?

[మార్చు]

రక్తనాళాల్లో ప్లాకు పేరుకుంటే వాటిలో రక్తప్రసారం అడ్డగించబడుతుంది. హై బ్లడ్‌ప్రెజర్‌కీ, గుండెజబ్బుకీ ఇదే ముఖ్య కారణం. ప్రతిరోజూ షుమారు ఒక గంటసేపు ఈ వ్యాయామాలు చేశ్తే శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. ముసలితనంలో చాలామందికి సెనిలిటీ, ఆల్‌జైమర్సు వ్యాధి వచ్చి, వాళ్ళు క్రమేపీ జ్ఞాపకశక్తిని పోల్గోటం జరుగుతోంది. ఇవి పేషంట్లకూ, వారికుటుంబాలఖూ ఎన్నో ఇక్కట్లు కల్గించే ఘోరమైన వ్యాధులు. ఈ వ్యాధులకు ముఖ్యకారణం మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడమే అని ఈ మధ్య తెలిసింది. దొర్లింగు, వణుకుల్లో తల తిప్పడంవల్ల, మెడ, మెదడుల్లో రక్తప్రసారం బాగా పెరిగి, మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. కొంతమంది దిప్రెషన్‌ తో బాధ పడుతుంటారు. మెదడుని శరీరంక్రిందిభాగంతో కలిపే వేగాస్‌ నర్వుని (ఇది మెడ ఎడమభాగం గుండా దిగుతుంది) ఉత్తేజ పరిస్తే వారి పరిస్థితి మెరుగవుతుందని ఈ మధ్య కనిపెట్టారు. దొర్లిగు, వణుకుల్లో తలతిప్పడం మూలాన వేగాస్‌ నర్వుకి ఈ ఉత్తేజం రోజూ కల్గి దిప్రెషన్‌ రాకుండా చేస్తుంది. ఈ మధ్య ఇండియన్స్‌లో డయాబెటీసు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఈ వ్యాధికి తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి: ప్రమేహం, అతిమూత్రం, మధు మూత్రం, మధుమేహం, అని. కానీ ఇప్పుడు డయాబెటీసు అనే పదం బాగా వాడుకలోకి వచ్చేశింది. ప్రతిరోజూ శరీరంలో అవయవాలనన్నిటినీ బలంగా కదిలించే వ్యాయామాలు చేస్తే డయాబెటీసు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని పరిశోధనలవల్ల తెలిసింది. ప్రతిరోజూ గోడకుర్చీ వెయ్యడంవల్ల మోకాటికీ, మోకాటిచిప్పకూ, కాళ్ళలోని, తుంటిలోని ఎముకలకూ; బలం చేకూరి, ఎముకలబలహీనతకు చెందిన వ్యాధులు రాకుండా చేస్తుంది. సరిపోయినంత కాల్షియం తమ భోజనంలో తీసుకుంటూ, రోజూ గోడకుర్చీ వేశేవారి కాలి ఎముకలకు ఆస్టియోపొరోసిస్‌ రాదు.

నా చిన్నప్పటి అనుభవం

[మార్చు]

మా పెద్దతాతయ్య గోడకుర్చీమీద ఒక మంచి సామెత చెప్పేవాడు. అది చెప్తాను. నా చిన్నప్పటికే పెద్దతాతయ్య ముసలివాడు. కానీ ప్రతిరోజూ కనీసం 5 నిమిషాలపాటు గోడకుర్చీ వేశేవాడు. "మీరూ వెయ్యండిరా మీ కాళ్ళు బలపడ్తాయీ" అని చెప్పేవాడు కానీ ఎవ్వరూ వీనేవాళ్ళం కాదు. దానికి ఆయన వాడే గోడను అందరూ "తాతయ్య గోడా" అని పిల్చేవారు. ఇండియాలో, రాత్రి పడుకున్న మంచాన్ని పగపూట ముడిచి గోడకు ఆన్చి ఉంచుతారుగదా. తాతయ్య గోడకు మాత్రం ముడిచిన మంచాలు ఆన్చడం నిషేధమ మా కుటుంబంలో. నేను ఎప్పుడైనా మర్చిపోయి నా మంచాన్ని ఆ గోడకు ఆనిస్తే మా అమ్మ "తాతయ్య గోడకు ఎందుకాన్చావురా నీ మంచాన్ని" అంటూ కోప్పడేది. ఒకసారి మాకుటుంబమంతా ఏదో పుణ్యక్షేత్రదర్శనానికి వెళ్ళాం. ఆ రోజల్లా చాలా నడవాల్సి వచ్చింది, కొండలు, మెట్లు చాలా ఎక్కాల్సివచ్చింది. సాయంత్రం బసకు చేరుకున్నవెంటనే చాలామంది "నాకాళ్ళు నొప్పిపెడ్తున్నాయి మొర్రో" అంటూ మంచాలమీద కూలారు. కానీ తాతయ్య మాత్రం కాయగూరలు కడిగి తరగడం మొదలుపెట్టాడు. "నీ కాళ్ళు నొప్పిపెట్టడం లేదా తాతయ్యా" అని అడిగితే "గోడకుర్చీతో గట్టిపడ్డ కాళ్ళు ఎంతదూరమైనా వెళ్ళగలవురా" అన్నాడు!.

మూలాలు

[మార్చు]