గ్రాంట్ బ్రాడ్‌బర్న్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గ్రాంట్ ఎరిక్ బ్రాడ్‌బర్న్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హ్యామిల్టన్, న్యూజీలాండ్ | 1966 మే 26|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి offbreak | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Wynne Bradburn (father) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 172) | 1990 అక్టోబరు 10 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2001 మార్చి 27 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 71) | 1990 నవంబరు 4 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2001 జూలై 25 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1985/86–2001/02 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 మే 13 |
గ్రాంట్ ఎరిక్ బ్రాడ్‌బర్న్ (జననం 26 మే 1966) న్యూజిలాండ్ క్రికెట్ కోచ్, మాజీ అంతర్జాతీయ క్రికెటరు. అతను 2023 మేలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.[1]
బ్రాడ్‌బర్న్ 1966లో హామిల్టన్‌లో జన్మించాడు. అతను కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలరు, దిగువ వరుసలో వచ్చే బ్యాటరు. 1990, 2001 మధ్య ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 11 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 16 సీజన్లలో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కోసం దేశీయ క్రికెట్ కూడా ఆడాడు.
ఆట నుండి రిటైరయ్యాక బ్రాడ్‌బర్న్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌కు న్యూజిలాండ్ అండర్-19కూ కోచ్‌గా పనిచేశాడు. 2014 ఏప్రిల్‌లో స్కాట్లాండ్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [2]
అతను 2018 నుండి 2021 వరకు పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసాడు. లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ హెడ్‌గా కూడా పనిచేశాడు. [3]
ఆటగాడిగా
[మార్చు]దేశీయంగా బ్రాడ్‌బర్న్, నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున 16 సీజన్లలో ఆడాడు. అతను అనేక స్థానాల్లో బ్యాటింగు చేశాడు. 1989/90, బ్రాడ్‌బర్న్‌కు అత్యంత విజయవంతమైన సీజను. ఆ సీజన్‌లో నాల్గవ స్థానంలో బ్యాటింగు చేసాడు. ఆ సీజనులో ప్రదర్శన తరువాత 1990లో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు జాతీయ జట్టు నుండి తొలి పిలుపు వచ్చింది.
శ్రీలంకలో 1992/93 సిరీస్ తర్వాత అతను న్యూజిలాండ్ జట్టు నుండి వైదొలిగినప్పుడు బ్రాడ్‌బర్న్స్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లు అనిపించింది, అయితే మళ్ళీ 2000/01 లో, 35 సంవత్సరాల వయస్సులో, జట్టు నుండి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే బాగా ఆడలేదు. మొత్తం మీద, అతను ఏడు టెస్టులు, 11 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున 115 మ్యాచ్‌లు ఆడి 27.96 సగటుతో 4,614 పరుగులు చేశాడు. ఆ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా తన కెరీర్‌ను ముగించాడు,
కోచింగ్ కెరీర్
[మార్చు]పదవీ విరమణ తర్వాత అతను నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ A కోచింగ్‌తో పాటు ఫ్యామిలీ స్పోర్ట్స్ స్టోర్‌ను నడిపాడు. 2008లో ఆండీ మోల్స్ న్యూజిలాండ్ కోచ్‌గా నియమితుడైనప్పుడు, మిగిలిన సీజన్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కోచ్‌గా బ్రాడ్‌బర్న్ అతని స్థానంలో చేరాడు.[4] అతను న్యూజిలాండ్ A, అండర్-19 జట్లకు కూడా ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. [5]
2014 ఏప్రిల్లో బ్రాడ్‌బర్న్, స్కాట్లాండ్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. అతని మొదటి ప్రధాన పని 2015 ప్రపంచ కప్ కోసం వారిని సిద్ధం చేయడం. బ్రాడ్‌బర్న్ నియామకం 2017 చివరి వరకు ఉండగా, దాన్ని వాళ్ళు 2018 చివరి వరకు పొడిగించారు. 2018 జూన్‌లో ఎడిన్‌బర్గ్‌లోని గ్రేంజ్‌లో అత్యధిక స్కోరింగ్ చేసిన వన్‌డేలో ఇంగ్లండ్‌పై స్కాట్‌లాండ్‌కు చారిత్రాత్మకమైన మొదటి విజయాన్ని అందించాడు.
2018 సెప్టెంబరులో బ్రాడ్‌బర్న్, 2018 ఆసియా కప్‌కు ముందు మూడు సంవత్సరాల పాటు పాకిస్థాన్ కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. [6] కుటుంబ కారణాలను పేర్కొంటూ, "మరిన్ని కోచింగ్ అవకాశాలను" వెతుక్కుంటూ 2021 అక్టోబరులో రాజీనామా చేశాడు. [3] 2023 మేలో బ్రాడ్‌బర్న్, రెండేళ్ల ఒప్పందంపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. [7] [8]
వ్యక్తిగత జీవితం
[మార్చు]బ్రాడ్‌బర్న్ తండ్రి వైన్ కూడా నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఆడాడు. న్యూజిలాండ్‌కు రెండు టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Bradburn confirmed as Pakistan men's head coach for next two years". ESPNcricinfo.
- ↑ "Grant Bradburn is new Scotland head coach". BBC Sport. 28 April 2014. Retrieved 28 April 2014.
- ↑ 3.0 3.1 Siddique, Imran (15 October 2021). "NZ's Grant Bradburn resigns as Pakistan's high-performance coaching head". Dawn. Retrieved 15 October 2021.
- ↑ "Northern Districts win Plunket Shield". ESPNcricinfo.
- ↑ "Grant Bradburn named New Zealand A and U-19 coach". ESPNcricinfo.
- ↑ "PCB appoints Grant Bradburn as Fielding Coach Pakistan Cricket Team". pcb.com.pk (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-09-06.
- ↑ "Morne Morkel set to be Pakistan's bowling coach, Mickey Arthur to be consultant". ESPNcricinfo. Retrieved 30 March 2023.
- ↑ "Grant Bradburn confirmed as Pakistan men's head coach". DAWN (in ఇంగ్లీష్). 13 May 2023.